రాయలసీమ ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బద్వేల్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అధికార ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టయినా పూర్తి చేసిందా? రాయలసీమకు ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారా? తెదేపా చేసిన పనుల్లో 10శాతమైనా వైకాపా ప్రభుత్వం చేసిందా? అంటూ ప్రశ్నలు సంధించారు. మిషన్ రాయలసీమలో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని.. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని నెరవేరుస్తామని చెప్పారు.
యువగళం పాదయాత్ర బద్వేల్‌లోకి ప్రవేశించగానే లోకేశ్‌కు అక్కడి ప్రజలు, పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. లోకేశ్‌ని చూసేందుకు, వారి సమస్యలు విన్నవించేందుకు మహిళలు, వృద్ధులు, యువత భారీగా రోడ్లపైకి వచ్చారు. అందరిని పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ.. తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు లోకేశ్. అలాగే కరెంట్ బిల్లులు విపరీతంగా పెంచేశారని.. మే నెల బిల్లులు చూసి షాకయ్యామని పలువురు మహిళలు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. సైకిల్ పాలన తెచ్చుకుంటే ప్రజలపై వేసిన భారం తగ్గిస్తామని లోకేశ్ ప్రజలకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.