వైసీపీ(YCP) పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నీర్వీర్యం అయ్యాయని టీడీపీ లీడర్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల్లో తిరుగుబాటు వస్తోందన్న బాలకృష్ణ.. అన్ని విధాలుగా ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల పైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. గుంటూరు(Guntur)లో అన్న క్యాంటీన్ ను బాలకృష్ణ ప్రారంభించారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో అధికార వైసీపీపై బాలకృష్ణ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం గుడిని గుడిలో లింగాన్ని మింగేసే రకం అని తీవ్రంగా విమర్శించారు. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు.. ఆత్మవిమర్శ చేసుకోవాలి.. అంటూ బాలకృష్ణ ఏపీ ప్రజలకు సూచించారు.
తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. కాగా.. శత జయంతోత్సవాల్లో భాగంగా నందమూరి బాలక్రిష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి