అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం తల్లడిల్లుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్ లోనే 31 అత్యాచారం, దాడులు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ మేరకు ఉన్నయోననే విషయం అర్థమవుతోందని అన్నారు. నేరాలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైమ్ రేట్‌పై వివరాలు, మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను గురించి వివరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి(DGP Rajendranath Reddy) చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కారణమంటూ మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వేస్టేషన్‌లో అత్యాచార ఘటన జరిగేది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి వాడకం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిందని, వాటి మత్తులో హింస, నేరాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతలు ఉన్నా.. పోలీసుశాఖ తగు చర్యలు తీసుకోవడం లేదని లేఖలో చంద్రబాబు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవీచదవండి
PM KISAN Samman Nidhi Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. ఎప్పుడు అంటే..?
Tomato Prices: భారీగా పెరిగిన టామోట ధరలు.. లాబోదిబోమంటున్న ప్రజలు