Buddha Venkanna: ‘100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీ.. చంపడానికైనా, చావడానికైనా సిద్దం’ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) జోలికి గానీ, ఆయన కుటుంబంలో ఎవరినైనా టచ్ చేస్తే.. ఎంతకైనా తెగిస్తామని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న(Buddha Venkanna) తెలిపారు.

Buddha Venkanna: '100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీ.. చంపడానికైనా, చావడానికైనా సిద్దం' బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..
Buddha Venkanna
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 20, 2022 | 5:51 PM

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అధ్వర్యంలో అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. చంద్రబాబు కటౌట్‌కు పాలాభిషేకం చేసి పేదలకు బట్టలు పంపిణీ చేశారు బుద్ధా వెంకన్న. ఈ సందర్భంగా ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు జోలికి వచ్చినా.. ఆయన కుటుంబంలో ఎవరినైనా టచ్ చేసినా.. ఎంతకైనా తెగిస్తామని బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. 100 మంది సూసైడ్ బ్యాచ్‌ను సిద్దం చేశామని.. చంద్రబాబు, ఆయన కుటుంబం జోలి కొస్తే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమన్నారు.

ఈ మధ్యకాలంలో చంద్రబాబుపై కొంతమంది చెత్త వాగుడు వాగుతున్నారు. వారందరికీ ఇదే హెచ్చరిక అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయనుకునే భ్రమ నుంచి అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా బయటికి రావాలి. ఇకనైనా వైసీపీ నేతలు తమ పద్దతిని మార్చుకోవాలి.. లేదంటే తగిన గుణపాఠం చెబుతామన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. ఆయన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. ప్రస్తుతం బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై స్పందించిన గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 100 మంది సూసైడ్ బ్యాచ్‌ను తయారు చేసుకున్నామని ఎలా మాట్లాడుతారని విమర్శించారు. చంద్రబాబు పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసుకోకుండా.. బుద్ది లేకుండా బుద్ధా వెంకన్న మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు.. చంద్రబాబును ఆ పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తారని అన్నారు.

Also Read: Anakapalle: పుష్ప.. కత్తి పట్టక ముందు.. కాబోయే వరుడితో సెల్ఫీ.. ఫొటో వైరల్

Paritala Sriram: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కొట్టిస్తారా.. కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేదీలేదుః పరిటాల శ్రీరామ్