Andhra Pradesh: గుడివాడలో టీడీపీ సభ అంటే.. కొడాలి నానికి చెమటలు పడుతున్నాయి.. బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్

|

Jun 28, 2022 | 2:48 PM

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Budda Venkanna) మండిపడ్డారు. అమ్మ ఒడి పేరుతో ల్యాప్ టాప్‌లు ఇస్తామని చెప్పి, మోసం చేస్తున్నారని ఆరోపించారు. 8 లక్షల 21 వేల మంది విద్యార్థులు ల్యాప్ టాప్ ల కోసం....

Andhra Pradesh: గుడివాడలో టీడీపీ సభ అంటే.. కొడాలి నానికి చెమటలు పడుతున్నాయి.. బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్
Budda Venkanna
Follow us on

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Budda Venkanna) మండిపడ్డారు. అమ్మ ఒడి పేరుతో ల్యాప్ టాప్‌లు ఇస్తామని చెప్పి, మోసం చేస్తున్నారని ఆరోపించారు. 8 లక్షల 21 వేల మంది విద్యార్థులు ల్యాప్ టాప్ ల కోసం దరఖాస్తు చేసుకుంటే ల్యాప్ టాప్ లు ఇవ్వకుండా ట్యాబ్ లు ఇస్తామనడం చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు ల్యాప్ టాప్ లు ఇవ్వకుంటే జూలై 1 నుంచి ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. గుడివాడలో టీడీపీ బహిరంగ సభ నిర్వహిస్తామంటే.. కొడాలి నానికి(Kodali Nani) చెమటలు పడుతున్నాయని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు అంటే కొడాలి నానికి భయం కలుగుతోందని చెప్పారు. 2009 లో చంద్రబాబు చేతిలో బీ-ఫామ్ తీసుకున్న విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసునన్న బుద్దా వెంకన్న.. ఈ అంశంపై చర్చకు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఎన్టీఆర్ కుటుంబం అంతా ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉండాలని కోరుకున్నారు. కొడాలి నాని తన ప్యాకేజీ కోసం జైలులో ఉన్న జగన్ ను కలిస్తే టీడీపీ నుంచి నెట్టేశాం. బుధవారం జరిగే బహిరంగ సభ ద్వారా కొడాలి నానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బయట జిల్లాల నుంచి ప్రజలు గుడివాడకు స్వచ్చందంగా వస్తున్నారు. కొడాలి నాని తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. గుడివాడ ప్రజలే నిన్ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి.

             – బుద్దా వెంకన్న, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ

ఇవి కూడా చదవండి

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు జులై 5 నుంచి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి విద్యాశాఖ తొలుత జులై 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని భావించింది. కానీ ఆరోజు ప్రధాని ఏపీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా స్కూళ్లను ఓపెన్ చేయనున్నారు. ఇక ఈ ఏడాది స్కూళ్లు మొత్తం 220 రోజులు పని చేస్తాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..