Bhuma Akhila Priya: మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు.. మరికాసేట్లో జైలు నుంచి విడుదల
నంద్యాలలో యువగళం పాదయాత్ర సందర్భంగా.. లోకేష్‌కి స్వాగతం పలికేందుకు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి వర్గీయులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా.. భూమా అఖిల ప్రియ వర్గం, ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అఖిల ప్రియతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అఖిల ప్రియకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 8 రోజులుగా జైలులో ఖైదీగా ఉన్న అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది.
తెలుగు దేశం పార్టీ(టీడీపీ) మాజీ మంత్రి భూమా అఖిలప్రయకు ఊరట లభించింది. సొంత పార్టీకి చెందిన ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో ఇటీవల అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఈ సాయంత్రం ఆమె కర్నూలు జైలు నుంచి విడుదల కానున్నట్లుగా సమాచారం. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో టీడీపీ నేత భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దర్నీ పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంలో ఈ గొడవ జరిగింది. ఈ సందర్భంలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఈ నెల 17న కొత్తపల్లి వద్ద భారీ ఏర్పాట్లు చేశాయి.
ఇరు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనలో అఖిలప్రియ దంపతులను ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పాణ్యం పోలీసు స్టేషన్‌కు తరలించారు. సెక్షన్ 307 కింద అఖిలప్రియ, ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం వారికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో ఎంట్రీ ఇచ్చినవేళ చిన్నపాటి యుద్ధం జరిగింది. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీ.. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసి పాణ్యం పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఆమెతో పాటు భార్గవ రామ్, పీఏ మోహన్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. డీజీపీతో ఫోన్‌లో మాట్లాడిన భూమా అఖిలప్రియ.. సుబ్బారెడ్డే తన చున్నీ లాగారని కౌంటర్‌గా మరో కంప్లయింట్ ఇచ్చారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డిపై కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి గతంలో అత్యంత సన్నిహితుడు. భూమా దంపతుల మరణం తరువాత అఖిలప్రియతో పొసగలేదు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, టిక్కెట్ కోసం పోటీకొస్తున్నారని వైవీతో వైరం పెంచుకుంది అఖిలప్రియ వర్గం. ఇప్పుడా రచ్చ రంబోలా అయ్యేసరికి పార్టీ అధిష్టానం సీరియస్సైంది. లొల్లికి అసలు కారణాలేంటి… ఎవరి తప్పు ఎంతుంది… ఎవరిమీద ఏమేం యాక్షన్ తీసుకోవచ్చు అనే అంశాలపై చర్చించడానికి త్రిసభ్య కమిటీ వేసింది. అటు… ఎవరితో మాట్లాడొద్దని, మీడియా ముందుకు వెళ్లవద్దని భూమా.. వైవీ వర్గాలకు హుకుం జారీ చేసింది టీడీపీ హైకమాండ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం