Chandrababu: బాంబులు వేసినప్పుడే భయపడలేదు.. ఆ మాటలు నన్ను బాధించాయి..

|

Nov 24, 2021 | 1:43 PM

అలిపిరిలో మావోయిస్టులు బాంబులు వేసినప్పుడే భయపడలేదని, కానీ అసెంబ్లీలోనే తన భార్య వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంతో తట్టుకోలేక పోయానన్నారు. తాను ఒక మనిషేనన్నారు.

Chandrababu: బాంబులు వేసినప్పుడే భయపడలేదు.. ఆ మాటలు నన్ను బాధించాయి..
Tdp Chief Chandrababu
Follow us on

TDP chief Chandrababu: అసెంబ్లీలో జరిగిన ఘటనపై తిరుపతిలో పర్యటనలో రియాక్ట్‌ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆయన పర్యటించారు. అలిపిరిలో మావోయిస్టులు బాంబులు వేసినప్పుడే భయపడలేదని, కానీ అసెంబ్లీలోనే తన భార్య వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంతో తట్టుకోలేక పోయానన్నారు. తాను ఒక మనిషేనన్నారు. అందుకే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే సీఎం జగన్‌ రోజుకో మాట మారుస్తున్నారని.. ఎక్కడో ఒక చోట గిరగిరా అని పడటం ఖాయమని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

రాష్ట్రంలో వరదలు మానవ తప్పిదం వల్లే వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. ఆ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్‌మెంట్ తెలయదని విమర్శించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆయన బాధితులతో మాట్లాడారు. ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. గొలుసుకట్టు చెరువులు ఉంటాయని.. వాటిలోకి వరద రాకముందే నీటిని విడిచిపెట్టాల్సి ఉంటుందన్నారు. అలా చేయని పక్షంలో మిగతా చెరువుల్లోనూ నీరు నిండిపోయి వరదలు వచ్చే ప్రమాదముంటుందన్నారు.

ఇవి కూడా చదవండి: ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..