Chandrababu Tour: నేడు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన.. పంట నష్టపోయిన రైతులకు పరామర్శ

ఈ రోజు చాగల్లు మండలంలోని ఐ పంగిడి , చాగల్లు, ఊనగట్ల, బ్రాహ్మణగూడెం ప్రాంతాల్లో పర్యటించి..  పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. అనంతరం కొద్దిసేపు విరామం తీసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ తిరిగి తన పర్యటనను ప్రారభించనున్నరు చంద్రబాబు.

Chandrababu Tour: నేడు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన.. పంట నష్టపోయిన రైతులకు పరామర్శ
Chandrababu Naidu

Updated on: May 06, 2023 | 8:32 AM

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నేడు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు కొవ్వురు రోడ్ కం రైల్ బ్రిడ్జి నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. తన పర్యటనలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ రోజు చాగల్లు మండలంలోని ఐ పంగిడి , చాగల్లు, ఊనగట్ల, బ్రాహ్మణగూడెం ప్రాంతాల్లో పర్యటించి..  పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు.

అనంతరం కొద్దిసేపు విరామం తీసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ తిరిగి తన పర్యటనను ప్రారభించనున్నరు చంద్రబాబు. నిడదవోలు మండలం కంసాలిపాలెం, తీరిగూడెం, సింగవరం ప్రాంతాల్లో పర్యటించి.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. తన పర్యటనను ముగించుకున్న  చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.

మరోవైపు చంద్రబాబు తాను పర్యటన చేస్తున్న తర్వాతనే ప్రభుత్వం నుంచి స్పందన మొదలైందన్నారు.  అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని..  ప్రీమియం చెల్లించలేదని చంద్రబాబు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

Reporter :  Ravi

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..