AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కేంద్రం మెడలు వంచుతానని చెప్పి.. ఆయనే ఢిల్లీలో మెడ వంచుతున్నారు.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

ఫ్యాన్ స్విచ్చాఫ్ చేసి సైకిల్ జోరు పెరిగితే బాధితులకు న్యాయం జరుగుతుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అన్నారు. అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వం,..

Andhra Pradesh: కేంద్రం మెడలు వంచుతానని చెప్పి.. ఆయనే ఢిల్లీలో మెడ వంచుతున్నారు.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
Chandrababu Naidu
Ganesh Mudavath
|

Updated on: Jul 29, 2022 | 9:33 PM

Share

ఫ్యాన్ స్విచ్చాఫ్ చేసి సైకిల్ జోరు పెరిగితే బాధితులకు న్యాయం జరుగుతుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అన్నారు. అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ పురంలో వరద బాధితులను పరామర్శించారు. పోలవరం (Polavaram) కట్టలేనని, ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేనని సీఎం అంటున్నారని.. కేంద్రాన్ని అడుగుతూనే ఉంటానని ఇలా మాటలు మాత్రమే చెప్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్.. ఆయనే ఢిల్లీకి (Delhi) వెళ్లి మెడ దించాడని ఎద్దేవా చేశారు. కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతున్నారని మండిపడ్డారు. పోలవరం ఆలస్యం కావడానికి ఏపీ ప్రభుత్వం కారణమని కేంద్రం చెప్పినప్పటికీ సీఎం జగన్ కు సరైన విజన్ లేదని విమర్శించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనన్న ముఖ్యమంత్రి ఆర్అండ్ఆర్ పై చేతులెత్తేశారని తీవ్ర విమర్శ చేశారు. అదే టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తి చేసి, నిర్వాసితులకు ఇళ్లు కట్టించిన విషయాన్ని గుర్తు చేశారు.

మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పోలవరం పూర్తి చేసి, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తా. ముంపు గ్రామాలను పాడేరు జిల్లాగా మార్చారు. ఇది కరెక్ట్ కాదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ముంపు ప్రాంతాలను పోలవరం ప్రత్యేక జిల్లా చేస్తా. మీ కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. హుదూద్ తుపాను వచ్చినప్పుడు కొత్త జీవో ఇచ్చి, అన్ని వసతులు కల్పించాం. విశాఖపట్నం వెళ్లి బస్సులోనే ఉన్నాను. కానీ గోదావరికి వరదలు వచ్చి అందరూ కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు.

– చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

వరదల్లో ముంపు బాధితులు సర్వస్వం కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎం పనితీరుకు సున్నా మార్కులు వేయాలని చెప్పారు. బటన్లు నొక్కే ముందు ముందు పోలవరం ముంపు బాధితులకు ఉపయోగపడే పని చేయాలని సూచించారు. పోలవరం ముంపు ప్రాంతాల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ముంపు మండలాలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..