Chandrababu: చంద్రబాబుకు దొరకని అమిత్ షా అపాయింట్మెంట్.. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం

|

Oct 26, 2021 | 4:29 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఆయన మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు

Chandrababu: చంద్రబాబుకు దొరకని అమిత్ షా అపాయింట్మెంట్..  మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం
Chandrababu And Amit Shah
Follow us on

Chandrababu Delhi Tour: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఆయన మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. అమిత్ షా అపాయింట్ మెంట్ లభించిన తర్వాత మరో మారు ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.  ఇలాఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి నిన్న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు రాష్ట్రంలో ప్రాయోజిత ఉగ్రవాదానికి పాల్పడుతోందని చంద్రబాబు నేతృత్వంలోని 7 గురు సభ్యుల టీడీపీ బృందం రాష్ట్రపతికి విన్నవించింది. నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన చంద్రబాబు బృందం ఈ మేరకు ఫిర్యాదు చేసింది.

ఏపీలో రాష్ట్రపతి పాలనతోపాటు డీజిపీని రీకాల్‌ చేయాలని కూడా తెలుగుదేశం బృందం రాష్ట్రపతిని కోరింది. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని.. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌ను కోరామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించటంతో పాటు.. ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఏపీ చిరునామాగా మారిందని చంద్రబాబు రాష్ట్రపతి ద‌ృష్టికి తీసుకెళ్లారు.

ఏపీలోని ఏజెన్సీలలో దాదాపు 25 వేల ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారని, మద్యపాన నిషేధమని చెప్పి ధరలు పెంచి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేతలు రాష్ట్రపతికి తెలిపారు. రాష్ట్రంలో మద్యం ప్రత్యేక బ్రాండ్లను సీఎం జగన్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల యువత నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడిందని.. మాదకద్రవ్యాలను అదుపుచేయాలని ప్రభుత్వాన్ని కోరితే, ఒకేసారి టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రపతికి తెలిపారు.

ఈ వ్యవహారాలపై తగిన చర్యలు తీసుకోవాలని బృందం రాష్ట్రపతిని కోరింది. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోపాటు, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏపీ లోని పరిస్థితులపై వివరించాలని భావించారు. అయితే, మోదీ, అమిత్ షా అపాంట్ మెంట్ చంద్రబాబుకు దొరకకపోవడంతో ఇప్పటికి ఏపీకి తిరుగు ప్రయాణమై, మరోమారు ఢిల్లీ వెళ్లి ఇరువుర్ని కలవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Read also:  Minister Anil Kumar Yadav: సీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు: మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్