Chandrababu Naidu: వరద బాధితులను ఆదుకోండి.. సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

|

Nov 28, 2021 | 12:14 PM

Chandrababu Naidu letter to CS: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రాయలసీమ, కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాలు అతలాకుతమయ్యాయి. పలు ప్రాంతాలు

Chandrababu Naidu: వరద బాధితులను ఆదుకోండి.. సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
Chandrababu Naidu
Follow us on

Chandrababu Naidu letter to CS: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రాయలసీమ, కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాలు అతలాకుతమయ్యాయి. పలు ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే మునిగిఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. తుఫాను కారణంగా నష్టపోయిన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల ప్రజలను, రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని.. వారందరికీ పరిహారం ఇవ్వాలని చంద్రబాబు కోరారు. వరద పరివాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సహాయం అందడం లేదని.. దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాటని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని తేలితే.. కేవలం రూ.35 కోట్లు విడుదల చేయడం సరికాదంటూ చంద్రబాబు కోరారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఒక్కరికీ సాయం అందించాలని చంద్రబాబు కోరారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇళ్లు కోల్పోయిన వారికి గృహ నిర్మాణం చేపట్టాలని సూచించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహాయ కొనసాగించాలని కోరారు. పంట నష్ట పరిహారాన్ని కూడా పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని.. రోడ్లు, వంతెనలు, విద్యుత్‌ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇప్పటికీ బాధితులు తిండి, వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, వరద బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని చంద్రబాబు లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు.

Also Read:

Indian Railway: ఇండియన్‌ రైల్వేలో ప్రాజెక్టు పోస్టులకు నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్‌ 23

WHO: పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు.. ఇప్పటి వరకు బయటపడ్డ వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో ఎలాంటి పేర్లు పెట్టిందంటే!