Nandamuri Taraka Ratna Death: నందమూరి తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
చివరకు విదేశీ డాక్టర్లతో చికిత్సను అందించినా.. అయినా ఆయన ప్రాణాన్ని నిలబెట్టలేక పోయారు. 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఈ రోజు (శనివారం 18న )తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
తారకరత్న మరణ వార్తతో సినీలోకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. నందమూరి ఫ్యామిలీకి పలువురు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసి, తన బాధను వ్యక్తం చేశారు.
‘నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న.. చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు.(1/2) pic.twitter.com/VfyfdHfKnF
— N Chandrababu Naidu (@ncbn) February 18, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..