Weather Alert: మరో మూడు రోజుల పాటు జోరు వానలు.. తాజా హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ

ఏపీపై మరో మూడు రోజులపాటు వాయుగుండం ఎఫెక్ట్‌ ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర,

Weather Alert: మరో మూడు రోజుల పాటు జోరు వానలు.. తాజా హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
Heavy Rainfall

Updated on: Nov 12, 2021 | 1:51 PM

Heavy Rainfall: చిత్తూరు జిల్లాలో వర్ష బీభత్సం ఓ రేంజ్‌లో ఉంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. స్వర్ణముఖీ నది ప్రవాహం ధాటికి ముగ్గురు కొట్టుకుపోయారు. తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో జరిగిందీ ఘటన. 250 కాలనీ దగ్గర వరద నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని కాపాడే ప్రయత్నం చేశారు.

ఏపీపై మరో మూడు రోజులపాటు వాయుగుండం ఎఫెక్ట్‌ ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. కుండపోత వానలకు చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు అధికారులు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఐతే ఇప్పటికే వాయుగుండం ఎఫెక్ట్‌తో విలవిలలాడుతున్న ప్రజలకు..మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. అండమాన్‌లో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని..ఈ నెల 17న కోస్తాంధ్ర వద్ద తీరం దాటనుందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..