నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో బుధవారం ఏర్పడినటువంటి అల్పపీడనం, ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఒక ఉపరితల ద్రోణి శ్రీలంక తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంనకు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు, సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :
—————————————————
ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
——————————
ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒకటి లేక రెండు ప్రదేశాలలో భారీ నుండి అతిభారీ వర్షాలుతో పాటు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
———————-
ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Also Read: ‘అమ్మ ఒడి’ డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే… ఏపీ సర్కార్ కొత్త షరతు
విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ… ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్