Andhra Pradesh: శ్మశానంలో విచిత్ర ముగ్గులు.. దగ్గరికి వెళ్లి చూసిన స్థానికులు షాక్..

|

Aug 24, 2022 | 3:13 PM

ఏపీలో దారుణ ఘటన వెలుగుచూసింది. శ్మశానంలోనే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటకను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra Pradesh: శ్మశానంలో విచిత్ర ముగ్గులు.. దగ్గరికి వెళ్లి చూసిన స్థానికులు షాక్..
Cemetery
Follow us on

AP Crime News: మూఢనమ్మకాలు.. కొందరి మెదళ్లను విడిచి వెళ్లడం లేదు. మంత్రతంత్రాలు, చేతబడుల పేరుతో పైశాచికాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడటం లేదు. నరబలులు వంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా ఆంధ్రా(Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai district)లో అదే తరహా ఘటన ఒకటి వెలుగుచూసింది. మాములుగా ఎవర్నైనా సరే చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్తారు. కానీ శ్మశానానికి తీసుకెళ్లాకే ఓ వ్యక్తిని చంపేశారు. గుప్తనిధుల కోసం ఈ దారుణానికి తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు. చెరువు మరవపల్లికి సమీపంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని నాగార్జున రెడ్డి అని గుర్తించారు. అతికిరాతకంగా రాళ్లతో దాడి చేసి అతడిని చంపేశారు. ఈ మర్డర్ జరిగిన ప్లేసుకు దగ్గర్లో విచిత్ర ముగ్గులు వేయడంతో పాటు తాంత్రిక పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో అతీత శక్తులు, గుప్త నిధులు కోసం ఈ హత్య జరిగిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. పోలీసులు స్పాట్‌కు చేరకుని డాగ్‌ స్క్వాడ్ సాయంతో వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం సేకరిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..