Exams In AP: త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ప‌రీక్ష‌ల‌కు అనుమతిస్తాం.. ఏపీలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీం వ్యాఖ్య‌లు.

|

Jun 22, 2021 | 6:45 PM

Exams In AP: ఏపీలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విష‌యంపై మంగ‌ళ‌వారం సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుప్రీం ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఇంత వ‌ర‌కు అఫిడ‌విట్ ఎందుకు దాఖ‌లు చేయ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు..

Exams In AP: త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ప‌రీక్ష‌ల‌కు అనుమతిస్తాం.. ఏపీలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీం వ్యాఖ్య‌లు.
Supreem Court
Follow us on

Exams In AP: ఏపీలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విష‌యంపై మంగ‌ళ‌వారం సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుప్రీం ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఇంత వ‌ర‌కు అఫిడ‌విట్ ఎందుకు దాఖ‌లు చేయ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. రెడు రోజుల్లో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.
ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటాన్నారని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించ‌గా ప‌రీక్ష హాల్‌లో కేవ‌లం 15 నుంచి 20 మందిని మాత్ర‌మే అనుత‌మిస్తామ‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఇద్ద‌రు విద్యార్థుల మ‌ధ్య క‌నీసం 5 అడుగుల భౌతిక దూరం ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఇక ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గ్రేడ్లు మాత్ర‌మే ఇస్తామ‌ని ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది తెలిపారు. ఇక ఈ విష‌యాల‌న్నీ విన్న కోర్టు త‌గిన‌న్నిజాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని కోర్టు తెలిపింది. ప్ర‌భుత్వం చెప్పిన అంశాల‌న్నింటినీ అఫిడ‌విట్‌లో పెట్టాల‌ని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఈ క్ర‌మంలోనే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా విద్యార్థుల ప్రాణాల‌కు ప్ర‌మాదం వ‌స్తే రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బాధ్యుల్ని చేస్తామ‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే క‌రోనా నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.. అయితే ఏపీ ప్ర‌భుత్వం మాత్రం విద్యార్థుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెబుతోంది.

Also Read: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు సుప్రీంకోర్టు ఊరట… బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత…

Telangana Farmers: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ‘రైతు బంధు’ నగదు అలా ఆపడానికి వీల్లేదంటూ బ్యాంకులకు ఆదేశాలు

రష్యన్ నేషనల్ పార్కులో దారుణం…16 ఏళ్ళ బాలుడిపై ఎలుగుబంటి దాడి… కాల్చి చంపిన రేంజర్లు