ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారిపై విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సీబీఐ నమోదు చేసిన FIR చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్‌ఎస్ అధికారులు. ఆదిమూలపు సురేష్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. విజయలక్ష్మి ఇంకా సర్వీసులోనే ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణతో 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు చేసింది సీబీఐ. ఈ క్రమంలోనే ఆదిమూలపు సురేష్ సతీమణి విజయలక్ష్మిపై కేసు పెట్టింది. 2017లో ఎఫ్‌ఐఆర్ నమాదు చేసింది. ఈ కేసులో విజయలక్ష్మిని ప్రధాన నిందితురాలిగా, ఆదిమూలపు సురేష్‌ను రెండో నిందితునిగా పేర్కొన్నారు అధికారులు.
దీనిపై హైకోర్టును ఆశ్రయించారు సురేష్ దంపతులు. ప్రాథమిక విచారణ జరపలేదని, కేసును కొట్టి వేయాలని పిటిషన్ వేశారు. హైకోర్టులో వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సీబీఐ. ఆ కేసులోనే సీబీఐకి అనుకూలంగా, మంత్రి సురేష్ దంపతులకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం.
Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..
Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..