Chandrababu Naidu: చంద్రబాబు పిటిషన్లపై కొనసాగుతున్న సస్పెన్స్.. మరో రెండువారాల తర్వాతే తీర్పు వచ్చే ఛాన్స్

ఇవాళ్టి కోర్టు అప్‌డేట్స్‌ కూడా బాబుకు పెద్దగా రిలీఫ్‌నిస్తున్నట్టు లేవు. ముఖ్యంగా స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఎప్పుడొస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారమే వాదనలు ముగిసి.. తీర్పును రిజర్వులో ఉంచింది సుప్రీం ధర్మాసనం. ఇవాళ ఈనెలలో సుప్రీంకోర్టుకు లాస్ట్ వర్కింగ్ డే. రేపటినుంచి 29 వరకు దసరా సెలవులు. కానీ..

Chandrababu Naidu: చంద్రబాబు పిటిషన్లపై కొనసాగుతున్న సస్పెన్స్.. మరో రెండువారాల తర్వాతే తీర్పు వచ్చే ఛాన్స్
Chandrababu Cases

Updated on: Oct 20, 2023 | 1:48 PM

చంద్రబాబు కేసుల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ్టి కోర్టు అప్‌డేట్స్‌ కూడా బాబుకు పెద్దగా రిలీఫ్‌నిస్తున్నట్టు లేవు. ముఖ్యంగా స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఎప్పుడొస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారమే వాదనలు ముగిసి.. తీర్పును రిజర్వులో ఉంచింది సుప్రీం ధర్మాసనం. ఇవాళ ఈనెలలో సుప్రీంకోర్టుకు లాస్ట్ వర్కింగ్ డే. రేపటినుంచి 29 వరకు దసరా సెలవులు. కానీ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ ఇవాళ లిస్టింగ్‌లోనే లేదు. తీర్పు కోసం మరో రెండువారాల సస్పెన్స్ తప్పదని తేలిపోయింది.

ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా పడింది. తొలుత నవంబర్ 8న హియరింగ్‌కి ఓకేనా అని ధర్మాసనం అడిగింది. కానీ.. చంద్రబాబు తరఫు అడ్వొకేట్ సిద్ధార్థ లూథ్రా అభ్యర్థన మేరకు నవంబర్ 9కి వాయిదా వేసింది. ఇప్పటికే… చంద్రబాబుపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చేదాకా ఈ పిటిషన్ విచారణ జరగొద్దని ఏపీ ప్రభుత్వ లీగల్ కౌన్సిల్ కూడా అభిప్రాయపడింది. దీంతో ముందస్తు బెయిల్‌పై సస్పెన్స్ తప్పలేదు.

క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తేనే పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తమ్మీద సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై రాబోయే తీర్పు మీదే మిగతా పిటిషన్లన్నీ ఆధారపడి ఉన్నాయి. సో… చంద్రబాబు కేసుల లీగల్ ప్రాసెస్‌ మరింత సంక్లిష్టం కావడానికి, తీర్పుల్లో ఆలస్యానికి సెక్షన్‌ 17-A నే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

అటు… లీగల్ ములాఖత్‌ల పెంపు అంశంలో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతోంది గనుక… చంద్రబాబుతో సంప్రదించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ములాఖత్‌ల సంఖ్య పెంచాలంటూ చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. కానీ.. ఇప్పుడు విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డ పిటిషన్‌లో జైలు అధికారుల్ని ప్రతివాదులుగా చేర్చాలని సూచించింది. దీంతో రోజుకు ఒక్కసారి మాత్రమే చంద్రబాబుతో ములాఖత్‌ కానున్నారు లాయర్లు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి