Andhra Pradesh: ప్రజలారా బీకేర్‌ఫుల్‌.. ఏపీలోని ఆ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఎండలు.. ఇక చుక్కలే..

ఆంధప్రదేశ్‌లో రేపు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు చెప్పారు.

Andhra Pradesh: ప్రజలారా బీకేర్‌ఫుల్‌.. ఏపీలోని ఆ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఎండలు.. ఇక చుక్కలే..
Heat Wave

Edited By: Ravi Kiran

Updated on: May 15, 2023 | 7:56 PM

ఆంధప్రదేశ్‌లో రేపు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు చెప్పారు. సోమవారం నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4°Cలు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2°Cలు, కృష్ణా జిల్లా కోడూరులో 46°Cలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(09) : గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్ళూరు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(194): అల్లూరి జిల్లా 5, బాపట్ల 18, తూర్పుగోదావరి 19, ఏలూరు 28, గుంటూరు 8, కాకినాడ 8, కోనసీమ9, కృష్ణా 15, ఎన్టీఆర్ 14, పల్నాడు 23, మన్యం 8, ప్రకాశం 6, శ్రీకాకుళం 1, నెల్లూరు 7, విజయనగరం 2, పశ్చిమగోదావరి జిల్లాలోని 11, వైఎస్సార్ 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ జిల్లాల వాసులకు అలర్ట్..

రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

సోమవారం 18 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 131 మండలాల్లో వడగాల్పులు వడగాల్పులు వీచాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..