Variety Marriage: అనంతపురంలో వింత ఆచారం.. పోటీ పడి మరీ పెళ్లి చేస్తామంటూ ముందుకొస్తున్న..

Variety Marriage: యావత్ ప్రపంచం అభివృద్ధివైపు పయనిస్తున్నా.. మన దేశంలో మాత్రం కొన్ని నమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి. ఆచార, సంప్రదాయాల...

Variety Marriage: అనంతపురంలో వింత ఆచారం.. పోటీ పడి మరీ పెళ్లి చేస్తామంటూ ముందుకొస్తున్న..

Updated on: May 27, 2021 | 11:17 PM

Variety Marriage: యావత్ ప్రపంచం అభివృద్ధివైపు పయనిస్తున్నా.. మన దేశంలో మాత్రం కొన్ని నమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి. ఆచార, సంప్రదాయాల పేరుతో వింత పనులు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వింత ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల బాలికకు వెంకటేశ్వర స్వామితో వివాహం జరిపించారు. అనంతపురం జిల్లా పరిధిలోని రాయదుర్గంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గంలో ప్రజలు ఏళ్ల నుంచి వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఎనిమిదేళ్ల బాలికతో శ్రీవారికి వివాహం జరిపించారు. రాయదుర్గంలో గల శ్రీ పసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో వందల ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. దాన్ని తాము కొనసాగిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.

ఇందులో భాగంగానే.. ప్రతీ ఏటా అరవ వంశానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికతో శ్రీవారికి వివాహం జరిపిస్తుంటారు. శ్రీవారితో వివాహ జరిపించేందుకు అరవ వంశస్థులు పోటీ పడటం విశేషం. ప్రతీ ఏటా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించే వారు. అయితే ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో గురువారం నాడు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిరాడాంబరంగా కల్యాణోత్సం నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి, భారతి దంపతులు హాజరయ్యారు.

Also read:

Fact Check: పసుపు, రాతి ఉప్పు, పటిక, ఆవ నూనెతో బ్లాక్ ఫంగస్ పారిపోతుందా?.. అసలు వాస్తవం ఏంటి..?

Fake Cowin Apps: వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ ఫోన్లకు మెసేజ్‌లు.. ఓపెన్ చేశారో అంతే సంగతలు..

Fake Cowin Apps: వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ ఫోన్లకు మెసేజ్‌లు.. ఓపెన్ చేశారో అంతే సంగతలు..