Andhra Rains: వాయుగుండం ఉగ్రరూపం.. ఈ జిల్లాలకు ప్లాష్ ప్లడ్ ముప్పు

వాయుగుండం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

Andhra Rains: వాయుగుండం ఉగ్రరూపం.. ఈ జిల్లాలకు ప్లాష్ ప్లడ్ ముప్పు
Abdhra Weather Report
Follow us

|

Updated on: Oct 16, 2024 | 4:22 PM

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 350 కిలోమీటర్లు, నెల్లూరుకి 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని చెప్పారు. ఈ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని రోణంకి కూర్మనాథ్ వివరించారు. గురువారం తెల్లవారుజామున చెన్నై దగ్గర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందన్నారు.

పలుచోట్ల తీవ్రభారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.

ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగానికి తీవ్రతను బట్టి సూచనలు జారీ చేస్తున్నామని రోణంకి కూర్మనాథ్ వివరించారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం కోటి రూపాయల చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు ఇచ్చామన్నారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో 4 మండలాల్లో, నెల్లూరులో 6, అన్నమయ్య జిల్లాలో 3 మండలాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందన్నారు. అవసరమైన చోట 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించామని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కాగా వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు తెలుసుకుని.. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?