AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: శవంతో సాహస యాత్ర.. అల్పపీడన ప్రభావంతో చిగురుటాకుల చిత్తూరు జిల్లా..!

తిరుపతి జిల్లాలోని కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే అరుణా నది కాలువను దాటి స్మశానానికి వెళ్లాల్సి ఉంది. తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ కాలువలో నీళ్లు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. గ్రామస్థులు శవాన్ని భుజాలపై మోసుకుని నడుము లోతు నీటిలో కాలువను దాటుకుని

Tirupati: శవంతో సాహస యాత్ర.. అల్పపీడన ప్రభావంతో చిగురుటాకుల చిత్తూరు జిల్లా..!
Heavy Rains To Perform Last
Raju M P R
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 16, 2024 | 1:56 PM

Share

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించగా ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జిల్లాను ముంచెత్తాయి. నాగలాపురం మండలంలో అరుణానది కి పోటెత్తిన నీటి ప్రవాహంతో కస్తూరి నాయుడు కండ్రిగ లో మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు గ్రామస్తులు అగచాట్లు పడ్డారు. అనారోగ్యంతో మృతి చెందిన 53 ఏళ్ల శంకర్ అంత్యక్రియలకు గ్రామం సమీపంలో ప్రవహిస్తున్న కాలువ అడ్డంకిగా మారింది. కాలువను దాటించేందుకు ఇబ్బందులు పడ్డ గ్రామస్తులు జోరుగా ప్రవహిస్తున్న కాలువ నీటి ప్రవాహం లోనే శవాన్ని తరలించాల్సి వచ్చింది. దాదాపు 4 అడుగులకు పైగా నదిలో ప్రవహిస్తున్న నీటిలో ఈదుకుంటూ శవంతో సాహస యాత్ర చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు మృతదేహాన్ని అరుణానది కాలువను దాటించి అంత్యక్రియలు పూర్తిచేసారు బంధువులు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

మరోవైపు తిరుపతి జిల్లాలో కురుస్తున్న ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఈసలాపురంకు రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ లో వర్షపు నీరు నిలిచిపోగా మోటార్లు చెడిపోవడంతో వర్షపు నీటిని పంపింగ్ చేయకపోయారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి

పుత్తూరు రూరల్ మండలం తోరూరు పంచాయతీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పైడిపల్లి, ఆనంబట్టు, గోపాల కృష్ణాపురం గ్రామాలు, ఎస్టీ కాలనీలకు రాకపోకలు బంద్ నిలిచిపోయాయి. రేణిగుంట లోని భగత్ సింగ్ కాలనీలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. ఏర్పేడు మండలం సీతకాలువ వద్ద కాజ్ వే పై వర్షపు నీరు ప్రవహిస్తునడంతో గుడిమల్లం, మోదుగుల పాలెం కు రాకపోకలు బంద్ అయ్యాయి. స్వర్ణముఖి నదికి భారీగా చేరుతున్న వరద చేరుతుండగా శ్రీకాళహస్తిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ బృందమ్మ కాలనీ లోకి ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చింది. ఇక రేణిగుంట రైల్వే స్టేషన్ ముందు నిలిచిపోయిన వర్షపు నీరు తో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రేణిగుంట మండలంలో కురుస్తున్న వర్షంతో ఎయిర్పోర్ట్ రన్వే పైకి కూడా వర్షపు నీరు చేరింది. విమాన రాకపోకలకు అంతరాయం కలగకుండా రన్వేపై చేరిన వర్షపు నీటిని సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..