Watch: తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో తాగుబోతులు..

Watch: తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో తాగుబోతులు..

Anil kumar poka

|

Updated on: Oct 16, 2024 | 12:49 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తాగిన మైకంలో ముగ్గురు యువకులు చేసిన పని ప్రాణాలమీదకు తెచ్చింది. ఫుల్‌గా తాగిన మైకంలో ఉన్న ముగ్గురూ సమీపంలోని ఓ చెరువు కట్టను ఎవరు ముందు ఈదుతారన్న ఛాలెంజ్‌ చేసుకున్నారు. అయితే ఇద్దరు ఈదలేక అలసిపోయి మధ్యలోనే తిరిగి వెనక్కొచ్చేశారు. ఓ యువకుడు మాత్రం పంతానికి పోయి అంత దూరం ఈదలేక మధ్యలోనే నీటిలో చిక్కుకున్నాడు.

ఈ సంఘటన ముస్తాబాద్‌ మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామం సమీపంలో ఉన్న పెద్ద చెరువు దగ్గర ఉన్న పెద్దమ్మ టెంపుల్ వద్ద ముగ్గురు యువకులు ఉదయం నుండి ఫుల్లుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో వారు ముగ్గురు మాట మాట పెరిగి పెద్దమ్మ దేవాలయం నుండి పెద్ద చెరువు కట్ట వరకు ఎవరు ముందుగా ఈత కొడుతూ చేరుకుంటారో అని ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు. వారు చేసుకున్న ఛాలెంజ్ ప్రకారం ముగ్గురు యువకులు మద్యం మత్తులో చెరువులో దూకి కొంత దూరం ఈత కొట్టగా, ముగ్గురిలో నుండి ఇద్దరు యువకులు అలిసిపోయి తిరిగి ఒడ్డుకి చేరుకున్నారు. సుమంత్ నాయక్ అనే యువకుడు అటు గమ్యం చేరుకోలేక, ఇటు ఒడ్డుకి రాలేక చెరువులోని బండరాయిపై చిక్కుకుపోయాడు. అక్కడ ఉన్న స్థానికులు కొందరు మండల మాజీ జెడ్పిటిసి కి సమాచారం ఇచ్చారు. గట్టుకి చేరుకున్న యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్, సిబ్బంది గ్రామంలో ఉన్న ట్రాక్టర్ ట్యూబ్ తీసుకొని దాని నిండా గాలి నింపి ఒక తాడు కట్టి దాని సాయంతో కానిస్టేబుల్ చెరువులో చిక్కుకున్న యువకుడి వద్దకు చేరుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. యువకుని ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ కుమార్ ను ఎస్సై గణేష్, గ్రామస్తులు అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 16, 2024 10:30 AM