సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు.. వరద బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు

|

Sep 11, 2024 | 9:04 PM

మూడు రోజులుగా ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో మొత్తం 27 ఇన్సూరెన్స్ కంపెనీలు ఫెసిలిటేషన్ సెంటర్ లో సేవలందిస్తున్నాయి. ఫెసిలిటేషన్‌ సెంటర్‌కి పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నారు. క్లైమ్ కోసం అత్యధికంగా ఆటోవాలాలు, మ్యాక్సీ క్యాబ్ వాలాలు, ద్విచక్రవాహనదారులు, దుకాణదారులు వస్తున్నారు.

సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు.. వరద బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు
Insurance Claims
Follow us on

విజయవాడలో వరదలతో అల్లాడుతున్న ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రస్తుతం వరదలతో పూర్తిగా నాశనమైన ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పాటు పాడైన వస్తువులు, వాహనాలను ఎలా సాధారణ స్థితికి తీసుకురావాలన్న దానిపై బాధితులు తీవ్రంగా మధనపడుతున్నారు. విజయవాడలో వరదతో పూర్తిగా నష్టపోయిన బాధితుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదలతో దెబ్బతిన్న వాహనాలు, విద్యుత్ పరికరాలు, ఇళ్ల ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సింగిల్ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేందుకు విజయవాడ సబ్ కలెక్టరేట్‌లో ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

మూడు రోజులుగా ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో మొత్తం 27 ఇన్సూరెన్స్ కంపెనీలు ఫెసిలిటేషన్ సెంటర్ లో సేవలందిస్తున్నాయి. ఫెసిలిటేషన్‌ సెంటర్‌కి పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నారు. క్లైమ్ కోసం అత్యధికంగా ఆటోవాలాలు, మ్యాక్సీ క్యాబ్ వాలాలు, ద్విచక్రవాహనదారులు, దుకాణదారులు వస్తున్నారు.

ద్విచక్రవాహనాలకు రూ.7వేల500, ఆటోలు, ఫోర్ వీలర్స్‌కు రూ.15వేలు స్పాట్‌లో సెటిల్ చేస్తున్నాయి ఇన్సూరెన్స సంస్థలు. ఇక పెద్ద క్లైమ్ అయితే సర్వేర్‌ను అపాయింట్ చేసి.. డాక్యుమెంట్స్ సబ్‌మిట్ చేస్తే ఎంత తొందరగా అవకాశం ఉంటే అంతతొందరగా క్లైమ్ పొందుతారని చెప్తున్నారు ఇన్సూరెస్ కంపెనీ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..