SBI Bank: గోల్డ్‌ గోల్‌మాల్‌ కేసులో వీడిన మిస్టరీ.. 7 కేజీల146 గ్రా. బంగారు నగల రికవరీ.. చోరీ చేసిన బంగారాన్ని ఏం చేశారంటే..

|

Dec 09, 2023 | 7:34 AM

కాకి ఎత్తుకెళ్లినట్టుగా ఖాతాదారులు తాకట్టు పెట్టిన , భద్రపర్చుకున్న బంగారు నగలు బ్యాంక్‌ నుంచి మాయం అయ్యాయి. నగలు తీసుకోవడానికి వెళ్తే బ్యాంక్‌ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఖాతాదారులకు అనుమానం కలిగింది. ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలోనే గార ఎస్‌బీఐ డిప్యూటీ మేనజర్‌ స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సినిమాటిక్‌గా జరిగిన గోల్డ్‌ డైవర్షన్‌ స్కామ్‌ విచారణలో బయటపడింది.

SBI Bank: గోల్డ్‌ గోల్‌మాల్‌ కేసులో వీడిన మిస్టరీ.. 7 కేజీల146 గ్రా. బంగారు నగల రికవరీ.. చోరీ చేసిన బంగారాన్ని ఏం చేశారంటే..
Sbi Bank Loan
Follow us on

ఏపీలో సంచలనం సృష్టించిన శ్రీకాకుళం జిల్లా గార స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గార పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన వారం రోజుల్లోపే సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసుని ఛేదించి సుమారు 60 బ్యాగులతో 7 కేజీల 146 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. చోరికి గురైన మొత్తం బంగారంలో 24.5 గ్రాముల బంగారం మాత్రమే ఇంకా రికవరీ కావాల్సి ఉందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి. అర్. రాధిక తెలిపారు. ముందు నుంచి అనుకున్నట్టు ఇది ఇంటి దొంగల పనే అని చివరకు తేల్చేశారు పోలిసులు. రికవరీ అయిన బంగారం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 7 కోట్లు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో మొత్తం 9 మంది ముద్దాయిలు ఉండగా వారిలో ఏడుగురు ముద్దాయిలను అరెస్టు చేసారు. కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఉరిటి స్వప్న ప్రియ కిందటి నెల 29న ఆత్మ చేసుకొని మృతి చెందగా..  ద్వితీయ ముద్దాయి, బ్యాంక్ ఎంప్లాయ్ అయిన సురేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. గార పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో అదనపు ఎస్పీ టి.పి విఠలేశ్వర్, శ్రీకాకుళం ఇంచార్జ్ ఎస్పీ బి. విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేసి ఎట్టకేలకు కొలిక్కి తెచ్చారు. మెయిన్ ముద్దాయి అయిన స్వప్న ప్రియ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని దొంగతనం చేసి తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. లోహిత కన్సేల్టిన్సి తిరుమల రావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మల్లించారు. లోహిత కన్సేల్టిన్సికి చెందిన తిరుమల రావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మల్లించారు.

బ్యాంకులో ఏడాది కాలంగా సాగుతున్న వ్యవహారం…

కేసు దర్యాప్తులో భాగంగా ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. బ్యాంక్ లాకర్ నుండి ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం భారీ మొత్తం లో చోరికి గురవ్వడం వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంది. ఈ వ్యవహారం అంతా ఒక్క రోజులోనే జరిగింది అయితే కాదని పోలీసులు తేల్చారు. ఏడాది కాలంగా కొంచెం కొంచెంగా ఆభరణాలను బైటకి మల్లించినట్లు తేలింది. ఇలా బయటకు మళ్లించిన బంగారాన్ని సిఏస్ బి, ఫెడరల్ బ్యాంక్ లలో బినామిల పేరుతో నిందితులు తాకట్టు పెట్టేవారు. అక్కడ వచ్చిన డబ్బులను డిప్యూటి మేనేజర్ స్వప్న ప్రియ, ఆమె సోదరుడు కిరణ్ .. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేవారు. ఈ వ్యవహారంలో డిప్యూటీ మేనేజర్ స్వప్న ప్రియతో పాటు బ్యాంక్ ఉద్యోగి సురేష్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. \

అయితే సురేష్ ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్యాంకులో ఆభరణాలు ఉన్న లాకర్ ఓపెన్ చేయటానికి స్వప్న ప్రియ వద్ద ఒక కీ సురేష్ వద్ద ఒక కీ ఉంటుంది. ఇద్దరు వద్ద ఉన్న రెండు కీ లు ఓపెన్ చేస్తేనే లాకర్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇందులో సురేష్ పాత్ర కూడా ఉందని  స్పష్టంగా కనిపిస్తోంది. లాకర్ నుండి మొత్తం 86 బ్యాగ్ లతో ఆభరణాలు మాయమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే బ్యాంక్ ఉన్నతాధికారులు స్వప్న ప్రియను విచారించగా తిరిగి 26 బ్యాగ్ లను వెనక్కి అప్పజెప్పారు. మిగిలిన బ్యాగ్ లను రికవరీ చేస్తుండగా డిసెంబర్ 29 న స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకుంది. దీంతో చేసేది లేక కిందటి నెల 30న బ్యాంక్ అధికారులు గార పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయిన వారం రోజుల్లోనే కేసును చేదించి రికవరీ చేశారు. రికవరీ అయిన బంగారాన్ని కోర్టు ద్వారా బ్యాంకు వారికి తద్వారా బ్యాంక్ ఖాతాదారులకు అప్పగించడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

బ్యాంకు వారు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిట్ జరుపుకోవాలని, బ్యాంకు ఖాతాదారులు కూడా ఎప్పటికప్పుడు తమ బంగారాన్ని సరి చూసకోవాలని, అలా చేసినపుడే ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా ఉంటాయని SP తెలియజేశారు.పై కేసులో చాకచక్యంగా పనిచేసి చేదించిన దర్యాప్తు అధికారికి, ఇతర అధికారులకు, సిబ్బందికి ఎస్పీ నగదు పురస్కారాన్ని, రివార్డ్ లను ప్రధానం చేసి ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..