
Ongole News: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.. బ్యాంక్ ఆవరణలోని సెక్యూరిటీ రూంలో తుపాకీతో కాల్చుకొని సూసైడ్‌కు పాల్పడ్డాడు. దీంతో వెంకటేశ్వర్లు స్పాట్ లోనే చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు బ్యాంకులోని సెక్యూరిటీ రూంలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమించిన బ్యాంక్ అధికారులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చీమకుర్తికి చెందిన ఏఆర్ పోలీస్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఒంగోలులో ఉంటూ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నారు. మానసిక ఆందోళనల కారణంగా గతంలో వెంకటేశ్వర్లు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడని.. ఈ క్రమంలో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..