Special Trains: తెలుగు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు

|

Feb 02, 2024 | 5:34 PM

తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌, తిరుపతి, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఇంతకీ ఏయే మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి...

Special Trains: తెలుగు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు
Special Trains
Follow us on

తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌, తిరుపతి, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఇంతకీ ఏయే మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు 08579 నెంబర్‌ రైలు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. విశాఖలో రాత్రి 7 గంటలకు బయలుదేరీ మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసును 2024 మార్చి 27 వరకు పొడగించారు.

* ఇక సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు 08580 నెంబర్‌ రైలు.. ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరీ మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

* విశాఖపట్నం నుంచి తిరుపతికి 08583 నెంబర్‌ ట్రైన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరీ, మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

* తిరుపతి నుంచి విశాఖకు 08584 నెంబర్‌ రైలు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

* విశాఖ నుంచి బెంగళూరుకు 08543 నెంబర్‌ ట్రైన్‌ ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

* బెంగళూరు నుంచి విశాఖపట్నం వరకు 08544 నెంబర్‌ రైలు ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరీ, తర్వాతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

* ఇక భువనేశ్వర్‌ నుంచి తిరుపతికి 02809 నెంబర్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది.ఈ రైలు భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరీ, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

* తిరుపతి నుంచి భువనేశ్వర్‌కు ప్రతీ ఆదివారం 02810 నెంబర్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతిలో రాత్రి 8.15 గంటలకు బయలుదేరి, తర్వాతి రోజు సాయంత్రం 5.25 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..