Andhra Pradesh: కొడుకు కాదు కాలయముడు.. తాగుడికి డబ్బులు ఇవ్వలేదని గతంలో తండ్రిని.. ఇప్పడు తల్లిని చంపిన తనయుడు

|

May 02, 2023 | 1:58 PM

14 ఏళ్ల క్రితం 2006 లో తాగుడికి డబ్బులివ్వలేదని కన్న తండ్రిని కర్కశంగా కొట్టి చంపాడు. నాలుగేళ్ళు జైళ్లో కూడా ఉండి వచ్చాడు. అయినా కూడా ఎలాంటి మార్పు రాలేదు. కట్టుకున్న పెళ్ళం వదిలేసింది. కన్న తల్లి తప్పాక ఇంట్లోనే పెట్టుకుని కాలం నెట్టుకొస్తోంది.

Andhra Pradesh: కొడుకు కాదు కాలయముడు.. తాగుడికి డబ్బులు ఇవ్వలేదని గతంలో తండ్రిని.. ఇప్పడు తల్లిని చంపిన తనయుడు
Son Killed Mother
Follow us on

తాగుడికి పెన్షన్ డబ్బులివ్వలేదని వృద్ధ తల్లిని కర్రతో కొట్టి చంపాడో కర్కశ కొడుకు. వయసైపోయిన తల్లికి తోడుండాల్సింది పోయి కలయముడై కాటికి పంపాడు.. 15 ఏళ్ల క్రితం కన్నా తండ్రిని సైతం ఇలానే కడతేర్చిన కాసాయి కొడుకు ఇప్పుడు కన్న తల్లిని కూడా కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం చింతల నర్వ శివారు చెన్నవరం గ్రామంలో ఈ దారుణ ఘటనా చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన కొడుకు విచక్షణ రహితంగా తల్లి తండ్రులను చంపి పొట్టన పెట్టుకున్నాడు. కనిపెంచినా తల్లి తండ్రులనే హతమార్చి హంతకుడయ్యాడు. డబ్బు కోసం తల్లిని అతి దారుణంగా హతమార్చటంతో గ్రామంలో విషాదా ఛాయలు అలుముకున్నాయి. సమాజంలో డబ్బు కోసం విలువలు బంధాలు కూడా మంట కలసిపోతున్నాయంటానికి ఇలాంటి సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరీదు వెంకమ్మ 70 ఏళ్ళ వయస్సు దిగువ మధ్యతరగతి కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడదు. ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు.. రెక్కలు కష్టంతో పిల్లల్ని పెద్ద చేసింది. కూతుర్లు పెళ్ళై అత్తారింటికి వెళ్ళగా కొడుక్కు మరీదు వెంకటేశ్వర్లు మాత్రం పెళ్ళై పిల్లలున్నా తల్లి తండ్రుల పాలిట కలయముడిగా మారాడు. పచ్చి తాగుబోతు, తిరుగుబోతు.. వీడి దెబ్బకు పెళ్ళాం సైతం వెంకటేశ్వర్లుని వదిలేసి వెళ్ళిపోయింది.

తాగుడికి అలవాటు పడ్డ వెంకటేశ్వర్లు మందు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు.. రోడ్లపై బికారుగా తిరుగుతూ తాగుడికి అడుక్కోవటానికి కూడా వెనుకాడడు. కాయ కష్టం చెయ్యడు ఇంట్లో కష్టపడే వారి సొమ్ము మిగిల్చడు. తాగి రోడ్లపై పడిపోవటం ఇంటికొచ్చి చిందులెయ్యటం ఇదే వెంకటేశ్వర్లు పని. అలానే 14 ఏళ్ల క్రితం 2006 లో తాగుడికి డబ్బులివ్వలేదని కన్న తండ్రిని కర్కశంగా కొట్టి చంపాడు. నాలుగేళ్ళు జైళ్లో కూడా ఉండి వచ్చాడు. అయినా కూడా ఎలాంటి మార్పు రాలేదు. కట్టుకున్న పెళ్ళం వదిలేసింది. కన్న తల్లి తప్పాక ఇంట్లోనే పెట్టుకుని కాలం నెట్టుకొస్తోంది. ఏడు పదుల వయసులో వచ్చే పెన్షన్ డబ్బులతో నాలుగు మెతుకులు తింటు కలం నెట్టుకొస్తోంది. ఇక అదే క్రమంలో నిన్న ఒకొటొ తేదీ కావటంతో పెన్షన్ డబ్బులు వస్తాయి అని ఇంటికొచ్చిన కొడుకు తల్లితో డబ్బులు కావాలని దెబ్బలాడి ఇవ్వకపోవటంతో రాత్రి పదిన్నర సమయంలో కర్రతో కిరాతకంగా కొట్టి చంపాడు.

ఇవి కూడా చదవండి

కిరాతకంగా కొట్టి చంపిన విషయం మృతురాలి కూతురు పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..