Fake Calls: 104 కాల్ సెంట‌ర్‌కు ఫేక్ కాల్స్ బెడ‌ద‌.. ఇబ్బంది పెట్టోద్ద‌ని కోరుతున్న అధికారులు..

|

May 08, 2021 | 6:02 AM

Fake Calls To 104: క‌రోనా ఆప‌త్కాల స‌మ‌యంలో రోగుల‌కు అండ‌గా నిలుస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 104 కాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ టోల్ ఫ్రీ నెంబ‌ర్ ద్వారా క‌రోనా...

Fake Calls: 104 కాల్ సెంట‌ర్‌కు ఫేక్ కాల్స్ బెడ‌ద‌.. ఇబ్బంది పెట్టోద్ద‌ని కోరుతున్న అధికారులు..
Fake Calls To 104
Follow us on

Fake Calls To 104: క‌రోనా ఆప‌త్కాల స‌మ‌యంలో రోగుల‌కు అండ‌గా నిలుస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 104 కాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ టోల్ ఫ్రీ నెంబ‌ర్ ద్వారా క‌రోనా ప‌రీక్ష‌ల వివ‌రాల‌తో పాటు, క‌రోనాతో సీరియ‌స్ ఉన్న వారికి ఆసుప‌త్రుల్లో బెడ్స్ ఏర్పాటుకు సంబంధించి స‌మాచారంతో పాటు సేవ‌లు అందిస్తున్నారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఈ సేవ‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. క‌రోనా బాధితులు భారీ ఎత్తున కాల్స్ చేస్తున్నారు.

అయితే మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కు ఫేక్ కాల్స్ బెడ‌ద వెంటాడుతోంది. క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంట‌ర్‌కు రోజూ వంద‌ల సంఖ్య‌లో కాల్స్ వ‌స్తున్నాయి. అయితే వీటిలో కొన్ని ఫేక్ కాల్స్ వ‌స్తుండ‌డంపై అధికారులు వాపోతున్నారు. ఏప్రిల్ మొద‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 3 వేల‌కిపైగా ఫోన్స్ కాల్స్ వ‌చ్చాయ‌ని చెబుతోన్న అధికారులు వాటిలో కొన్ని ఫేక్ కాల్స్ ఇబ్బందికి గురి చేస్తున్నాయని చెబుతున్నారు. ఫేక్‌ కాల్స్‌ వల్ల తమ పని కష్టమవుతోందని వాపోతున్నారు. కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసినవారు తిరిగి తాము కాల్ చేస్తే సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని చెప్పుకొచ్చారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆపదలో ఉన్నవారికి సాయపడాల్సిన వేళ ఫేక్‌ కాల్స్‌ చేసి ఇబ్బంది పెట్టడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: AP Corona Cases: ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా 73మంది మృతి.. మరో 17,188 మందికి పాజిటివ్

400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర పోలీసులు..! సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం..

Criminal Case on Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై నాన్ బెయిల్ కేసు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కర్నూలు పోలీసులు