Narasannapeta: కొండ నాగులను, కొండ చిలువలను అలవోకగా బంధించిన వ్యక్తి.. చివరకు పాము కాటుతో

పాములు పట్టుకోవడంలో ఆయన నేర్పరి. సమీప ప్రాంతాల్లో ఎక్కడ పాములు కనిపించినా ఆయనకే ఫోన్ వస్తుంది. ఎలాంటి పరికరం అవసరం లేకుండా సునాయాసంగా పామును పట్టుకొని.. వాటిని అటవీప్రాంతంలో విడిచేవాడు. కానీ తాజాగా అంతా అనుకున్నట్లు సవ్యంగా జరగలేదు.

Narasannapeta: కొండ నాగులను, కొండ చిలువలను అలవోకగా బంధించిన వ్యక్తి.. చివరకు పాము కాటుతో
Snake Catcher Dies

Updated on: Apr 21, 2023 | 9:26 AM

ఆయన పాములు పట్టడంలో నేర్పరి. ఎంతటి ప్రమాదకర పామునైనా చాకచక్యంగా బంధిస్తాడు. పెద్ద పెద్ద కొండ నాగులను, కొండ చిలువలను సైతం ఎలాంటి బెరుకు లేకుండా ఒంటి చేత్తో చాకచక్యంగా పట్టుకొనే వాడు. పాములు పట్టడంతో ఆరితేరిన ఆ వ్యక్తి.. చివరికి  పాము కాటుకే బలయ్యాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నరసన్నపేటలోని గాంధీనగర్‌-4వ వీధిలో ఉంటున్న గుడ్ల రామజోగి(60) భారత సైన్యంలో పనిచేసి.. 14 ఏళ్ల క్రితం రిటైరయ్యాడు. రామజోగికి భార్య, ఇద్దరు తనయులు ఉన్నారు. అయితే అతనికి పాములు పట్టడం యుక్త వయసులో ఉన్నప్పటి నుంచే అలవాటు. జనావాసాల్లోకి పాములు వస్తే.. వాటిని పట్టి అటవీ ప్రాంతంలో వదిలేస్తూ ఉంటాడు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాల్లోకి పాములు వస్తే.. వెంటనే రామజోగికి ఫోన్ చేసేవారు.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27న పోలీసుస్టేషన్‌ సమీపంలోనూ, మార్చి 5న సబ్‌ట్రెజరీ ఆఫీసు సమీప ప్రాంతంలో కనిపించిన పాములను పట్టుకొని వాటిని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. ఈ నెల 19న తామరాపల్లిలో ఓ పాము సంచరిస్తుందని సమాచారం రావడంతో రామజోగి అక్కడి వెళ్లారు. దాన్ని సేఫ్‌గా బంధించాడు. కానీ నిర్మానుష్య ప్రాంతంలో విడిచి పెడుతున్న సమయంలో ఆ పాము కాటేసింది. వెంటనే రామజోగిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స అందిచినప్పటికీ.. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య కంప్లైంట్ చేయడంతో నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..