Andhra Pradesh: అక్కడ ఎలారా.. ట్రాక్టర్ ట్రక్కు కింద గుట్టుగా.. బిత్తరపోయిన పోలీసులు

| Edited By: Ram Naramaneni

Aug 15, 2024 | 8:58 AM

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పుష్ప రేంజ్‌ స్కెచ్చులతో పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఖాకీలు ఏమైనా తక్కువ తిన్నారా..? తమ మార్క్ తనిఖీలతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు.

Andhra Pradesh: అక్కడ ఎలారా.. ట్రాక్టర్ ట్రక్కు కింద గుట్టుగా.. బిత్తరపోయిన పోలీసులు
Ganja Smuggling
Follow us on

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి వెలుగులోకి వస్తుండడంతో స్మగ్లర్లపై డేగ కన్నేశారు ఏపీ పోలీసులు. పెడ్లర్ల జిత్తులను చిత్తు చేసేలా వాహనాలను అణువణువూ తనిఖీ చేస్తున్నారు. రియల్ లైఫ్ పుష్ప గాళ్ల బెండు తీస్తున్నారు. తాజాగా ఏపీలోని కూనవరం రోడ్డులో అక్రమ గంజాయి రవాణా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఎస్‌హెచ్‌ఓ షేక్ రహీమున్నీసా బేగం నేతృత్వంలోని  ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం 156 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు బృందం ఆ ప్రాంతంలో వాహనాల తనిఖీ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ట్రాలీ ట్రాక్టర్‌ అటుగా రావడంతో ఆపి చెక్ చేశారు. ఈ క్రమంలో ట్రక్ కింద దాచిన ఎండు గంజాయిని గుర్తించారు. ఈ ప్రాంతంలో గంజాయి రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజా స్మగ్లింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తులను గుర్తించేందుకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గంజాయి మూలాన్ని గుర్తించి.. భద్రాచలం మీదుగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గంజాయి నిర్మూలనపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని డిసైడైంది ఏపీ ప్రభుత్వం. ప్రధానంగా గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు యుద్ధప్రాతిపదికన సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల ప్రారంభంలో మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన భేటీకి నారా లోకేష్‌, కొల్లు రవీంద్ర, సత్య కుమార్‌, సంధ్యారాణి హాజరయ్యారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై సబ్ కమిటీ చర్చించింది. మత్తు పదార్థాల రవాణాను నియంత్రించేందుకు జిల్లాలవారీగా యాంటీ నార్కొటిక్ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని పోలీసులకు కమిటి ఆదేశాలిచ్చింది. గంజాయి బాధితులకు డి అడిక్షన్ కేంద్రాలపైనా ఫోకస్ చేస్తూనే.. ప్రతీ జిల్లాకు టోల్‌ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటిదాకా 5వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్టు ఓ అంచనా. ఇందులో సాగు వేసే లోగా నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

కొంతమంది గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయిని సప్లయ్ చేస్తున్నారన్నారు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. అలాంటివారి కారణంగా చాలామంది జైళ్లలో మగ్గిపోతున్న పరిస్థితి ఉందన్నారు. గంజాయి వైపు వెళ్లకుండా ఇతర పంటల సాగుకి గిరిజనుల్ని మళ్లించడం. అలాగే ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది కేబినెట్‌ సబ్ కమిటీ. అలాగే ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు పంపించింది. ఫైనల్‌గా వందరోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..