అనంతపురం, జులై 27: ఇసుక అక్రమ తవ్వకాలకు పాతి పెట్టిన శవాలు బయటకు వస్తున్నాయి. పాతి పెట్టిన శవాల అస్థిపంజరాలు బయట పడడంతో.. పూర్వీకుల అస్థిపంజరాల కోసం గ్రామస్థులు వెతుకులాట మొదలుపెట్టారు. కంబదూరు మండలం కర్తనపర్తి పెన్నా నదిలో యధేచ్చగా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాల కోసం ఆఖరికి శవాలను సైతం ఇసుక మాఫియా తోడేస్తుందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలతో పెన్నా నదిలో తమ పూర్వీకుల అస్తిపంజరాల ఎక్కడున్నాయోనని గ్రామస్తులు వెతుక్కుంటున్నారు.
ఇసుక తవ్వకాల కోసం పెన్నానది పక్కనే ఉన్న శ్మశానాన్ని కూడా వదలడం లేదంటున్నారు గ్రామస్థులు. ఇసుక మాఫియా దెబ్బకు చచ్చిన శవాలు కూడా బయటకు వస్తున్నాయని. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని.. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వేడుకుంటున్నారు. అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నా.. రెవెన్యూ, పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసం ఆఖరికి సమాధాలు కూడా తవ్వేస్తున్నారని బయటపడ్డ అస్థిపంజరాలు చూపిస్తున్నారు గ్రామస్థులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..