వివేకా హత్యకేసులో మాజీమంత్రికి సిట్ నోటీసులు

| Edited By:

Dec 09, 2019 | 9:36 PM

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలంటూ రెండు సార్లు సిట్ ఆదేశాలు జారీ చేసిన.. విచారణకు రాకుండా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీచేసింది. అయితే సెక్షన్ 41ఏ కింద అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో.. తాను అందుబాటులో లేనంటూ.. ఆది నారాయణ రెడ్డి సిట్ అధికారులకు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. […]

వివేకా హత్యకేసులో మాజీమంత్రికి సిట్ నోటీసులు
Follow us on

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలంటూ రెండు సార్లు సిట్ ఆదేశాలు జారీ చేసిన.. విచారణకు రాకుండా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీచేసింది. అయితే సెక్షన్ 41ఏ కింద అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో.. తాను అందుబాటులో లేనంటూ.. ఆది నారాయణ రెడ్డి సిట్ అధికారులకు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్ వివేకా హత్య.. ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. వైఎస్ వివేకానందరెడ్డి.. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డికి తమ్ముడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌కి స్వయంగా బాబాయి. అంతేకాదు.. మాజీ మంత్రి కూడా.. అయినప్పటికీ.. వివేక హత్య కేసులో దోషుల్ని పట్టుకోలేదని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ కేసు విచారణకు జగన్‌ సర్కార్‌ సిట్‌ను నియమించింది.