AP News: లంచం కోసం చూస్తే.. అసలుకే ఎసరు వచ్చింది

అల్లూరి సీతారామరాజు జిల్లాలో లంచం తీసుకున్నాడని ఓ ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. లంచం తీసుకొని ఎస్‌ఐ నిందితులను వదిలిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఎస్‌ఐను సస్పెండ్ చేశారు.

AP News: లంచం కోసం చూస్తే.. అసలుకే ఎసరు వచ్చింది
Si Suspended For Taking Bribe
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2024 | 9:24 PM

గంజాయి నిర్మూలించి స్మగ్లర్ల భరతం పట్టాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే.. కొంతమంది అవినీతి అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు. బాధ్యతలు మరచి.. లంచం కోసం చేయి చేస్తున్నారు. కేసు పెట్టకుండా ఉండాలంటే లక్ష ఇవ్వాల్సిందే.. లేకుంటే తీవ్రమైన కేసుల్లో ఇరుక్కోవాల్సిందే అని బేరం మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ఘటన అల్లూరి జిల్లాలో ఘటన చోటుచేసుకుంది.  లంచగొండి అవినీతి అధికారి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. ఎస్పీ నివేదికతో డీఐజీ యాక్షన్ అప్లై చేశారు. ఆ అవినీతి ఎస్ఐను సస్పెండ్ చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌లోని ఎస్‌ఐ కె.రామకృష్ణ గంజాయి వ్యాపారులతో సహకరిస్తున్నందుకు సస్పెన్షన్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూలై 4న 20 కేజీల గంజాయితో పాటు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఎస్ఐ రామకృష్ణ.. స్మగ్లర్లతో బేరాలు మొదలు పెట్టాడు. లంచం ఇస్తే కేసు నమోదు చేయకుండా వదిలేస్తానని ఆఫర్ చేశాడు. చివరకు బేరం కుదిరింది. ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా నిందితుల నుండి  రూ.1,25 లక్షలు లాగేసాడు. గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని విడిచి పెట్టేసాడు. దీనిపై ఆరోపణలు రావడంతో.. పోలీసులు విచారణ ప్రారంభించారు. అల్లూరి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దీనిపై దృష్టిసారించి ఎస్సై రామకృష్ణ పాత్ర ఉందని నిరూపించారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నిజమేనని.. డబ్బులు తీసుకొని నిందితులను వదిలేసినట్టు గుర్తించారు. ఒక నివేదికను డీఐజీ గోపీనాథ్ జెట్టికి ఎస్పీ అందించారు. దీంతో అవినీతి ఎస్ఐ రామకృష్ణకు డీఐజీ సస్పెండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!