Andhra Pradesh: ఆ ఊరంతా మూగ జీవాలను కత్తి పోట్లు.. ఎంటా అని ఆరా తీయగా..

కర్నూలు జిల్లాలో రాత్రైతే చాలు.. మూగ జీవాలు తల్లిడిల్లిపోతున్నాయి. సుమారు 10 పశువులపై గుర్తు తెలియని సైకోలు దాడి చేయడంతో రైతులు గోనెగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh: ఆ ఊరంతా మూగ జీవాలను కత్తి పోట్లు.. ఎంటా అని ఆరా తీయగా..
Attack On Cows
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 26, 2024 | 4:14 PM

కర్నూలు జిల్లాలో రాత్రైతే చాలు.. మూగ జీవాలు తల్లిడిల్లిపోతున్నాయి. ఇంటి ముందు కట్టేసిన పశువులు, తెల్లాసరికల్లా రక్తమడుగులో పడి ఉంటున్నాయి. కొత్త రకం సైకోలు రాత్రి సమయంలో రెచ్చిపోతున్నారు. మనుషులే కాదు పశువులపై సైతం దాడి చేస్తున్నారు. కనిపించిన ఆవులను, ఎద్దులను కత్తితో కోస్తూ పైశాచిక ఆనందం పొందాడో సైకో. దీంతో రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

గోనెగండ్ల మండలం కేంద్రంలో సైకోలు వీరంగం సృష్టిస్తున్నాడు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మూగజీవులైన ఆవులు, ఎద్దులు, గొర్రెలను, కత్తులతో తీవ్రంగా పొడిచి వెళ్లిపోయారు. ఇంటి ముందు ఉన్న పశువులు ఆ కత్తిపోట్లకు తీవ్ర రక్తస్రావమవుతున్నడంతో పెద్ద ఎత్తున మూగజీవులు అర్తనాదాలు పెట్టాయి. గమనించిన పశువుల యజమానులు, రైతులు వెళ్లి వెంటనే చికిత్స కొరకు పశు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు.

ఇలా సుమారు 10 పశువులపై గుర్తు తెలియని సైకోలు దాడి చేయడంతో రైతులు గోనెగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది సైకోలు మూగజీవులపై దాడి చేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పశువులపైన జీవనం సాగించే వాళ్ళమని, పశువులపై దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయామని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇది గ్రామానికి చెందిన వ్యక్తి చేసిన పనినా.. లేక ఏదైనా కక్ష పెట్టుకుని ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..