AP Power Cuts: ఓ వైపు ఎండలు.. మరోవైపు కరెంట్ కోతలు.. ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌హాలిడేకి రీజనేంటి?

ఒకవైపు దంచికొడుతున్న ఎండలకు ఈ కరెంట్‌ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక సతమతమైపోతున్నారు. రాత్రిపూట సైతం పవర్‌ కట్స్‌ ఉండటంతో నిద్ర కూడా కరవవుతోంది.

AP Power Cuts: ఓ వైపు ఎండలు.. మరోవైపు కరెంట్ కోతలు.. ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌హాలిడేకి రీజనేంటి?
Power Cut
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 09, 2022 | 7:27 AM

Andhra Pradesh Power Cuts: ఆంధ్రప్రదేశ్‌ను కరెంట్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. పవర్‌ కట్స్‌తో ఏపీ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు దంచికొడుతున్న ఎండలకు ఈ కరెంట్‌ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక సతమతమైపోతున్నారు. రాత్రిపూట సైతం పవర్‌ కట్స్‌ ఉండటంతో నిద్ర కూడా కరవవుతోంది. టార్చిలైట్ల వెలుతురులో హాస్పిటల్స్‌లో ఆపరేషన్స్‌ చేస్తున్నారంటే కరెంట్‌ కోతలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధంచేసుకోవచ్చు. గంట కాదు, రెండు గంటల కాదు, ఏకంగా ఆరు నుంచి పన్నెండు గంటలపాటు పవర్‌ కట్స్‌ ఉంటున్నాయ్‌. మరి, ఈ కరెంట్‌ కష్టాలకు కారణమేంటి? ఎందుకీ పరిస్థితి?.

కర్ణుడి చావుకి అనేక కారణాలన్నట్టుగా, ఏపీలో పవర్‌ కట్స్‌కు కూడా అదే డైలాగ్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ 230 మిలియన్‌ యూనిట్ల డిమాండ్ ఉంటే… థర్మల్‌, విండ్‌, సోలార్‌ పవర్‌ సెంటర్స్‌ నుంచి 140 మిలియన్ యూనిట్స్‌ సప్లై జరుగుతోంది. సెంట్రల్‌ గ్రిడ్స్‌ నుంచి 40 నుంచి 45 మిలియన్‌ యూనిట్స్‌ అందుతోంది. అయితే, ఇంకా 50 మిలియన్‌ యూనిట్ల కొరత ఉందంటోంది ఏపీ ప్రభుత్వం. డైలీ షార్జేజ్‌ వస్తోన్న విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేద్దామన్నా, అందుబాటులో ఉండటం లేదన్నది సర్కార్ మాట. మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉండటం మరో కారణం. పీక్‌ అవర్స్‌లో ఆ రేటు మరింత ఎక్కువగా ఉంటోందని చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు బొగ్గు కొరతతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు కెపాసిటీ కంటే తక్కువ కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని అంటోంది.

అటు గ్రామాల్లో, చిన్న ప‌ట్ట‌ణాల్లో విద్యుత్ కోత‌లు అధిక‌మ‌య్యాయి.ముఖ్యంగా వ్యవ‌సాయ‌,ఆక్వా రైతుల‌కు కూడా క‌రెంట్ కోత‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి. ఆక్వా రైతుల‌కు విద్యుత్ కోత‌ల‌తో పూర్తిగా జ‌న‌రేట‌ర్ల కోసం డీజిల్ పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది.పెట్టుబ‌డి ఖ‌ర్చు భారీగా పెరిగిపోవ‌డంతో తీవ్ర న‌ష్టాల‌బారిన ప‌డ‌తామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరోవైపు, ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే ఉన్న వీక్లి హాలీడే కు అదనంగా మరో రోజు కోత విధించింది.విద్యుత్ వాడకం పెరగడం తోనే ఈ నిర్ణయం అంటుంది ప్రభుత్వం.ప్రభుత్వ నిర్ణయంతో కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పరిశ్రమలకు గట్టి దెబ్బ తగిలనట్లైంది. వేసవిలో వినియోగం భారీగా పెరగడంతో కోతలు కూడా పెరిగిపోయాయి.దీంతో పరిశ్రమలకు వారంలో రెండో రోజు కూడా పవర్ హాలీ డే ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే వారంలో ఒకరోజు పరిశ్రమలు పూర్తిగా మూసివేస్తున్నారు. దీనికి తోడు మరొక రోజు కూడా పవర్ హాకీ డే ప్రకటించింది సర్కార్.24 గంటలు పనిచేసే పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్ మాత్రమే వినియగించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది.అయితే ఏపీలో ఉన్న ధర్మల్ విద్యుత్ కేంద్రాలు,సౌర, పవన విద్యుత్ కేంద్రాల నుంచి 140 ఎంయూ కేంద్ర గ్రిడ్ ల నుంచి 40 యూనిట్లు అందుబాటులో ఉంది.మరొక 50 యూనిట్లు ప్రతిరోజూ అవసరం పడుతుంది. ఈ విద్యుత్ ను ఎక్స్చేంజి ద్వారా బహిరంగ మార్కెట్ లో కొంటుంది ప్రభుత్వం. అయితే కొంతకాలంగా దేశవ్యాప్తంగా డిమాండ్ తీవ్రం కావడంతో బహిరంగ మార్కెట్ లో సైతం విద్యుత్ కొనలన్నా కూడా దొరకడం లేదని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ చెప్తున్నారు.

థ‌ర్మల్ విద్యుత్ కేంద్రాల‌కు అవ‌స‌ర‌మైన బొగ్గు లేక‌పోవ‌డం,ఏ రోజుకారోజు బొగ్గు ర‌వాణా చేయాల్సి రావ‌డం,ఒక‌వేళ కొందామ‌న్నా కూడా అందుబాటులో లేక‌పోవ‌డం, మార్కెట్ లో ఎక్కువ రేటు ఉండ‌టంతో కెపాసిటీ కంటే త‌క్కువ‌గా విద్యుత్ ను ప్రొడ్యూస్ చేయాల్సి వ‌స్తుంది.ప్ర‌యివేట్ విద్యుత్ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే పీక్,నాన్ పీక్ అవ‌ర్స్ ను బ‌ట్టి రేటు ఉంటుంది.యావ‌రేజ్ గా యూనిట్ కు 12 రూపాఇయిల చొప్పున కొన్నిరోజుల వరకూ కొనుగోలు చేసింది ప్ర‌భుత్వం.అయితే అసలు ఇప్పుడు మార్కెట్ లో కొనలన్నా దొరకడం లేదు.దీంతో లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు క‌నీసం 6 గంట‌ల పాటు అన‌ధికారిక కోత‌లు విధిస్తున్నారు.గ్రామాల్లో,చిన్న ప‌ట్ట‌ణాల్లో విద్యుత్ కోత‌లు అధిక‌మ‌య్యాయి.అయితే గృహాలకు,వ్యవసాయానికి కోతలు లేకుండా చేయాలన్న సీఎం ఆదేశాలతో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించినట్లు శ్రీధర్ చెప్పారు ఒక రోజు హాలీడే వల్ల 20 మిలియన్ యూనిట్లు ఆదా అవుతుందని…ఆ మేరకు గృహాలకు,వ్యవసాయానికి సర్దు బాటు చేస్తామంతున్నారు.అటు ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్,హోర్డింగ్స్ లో కూడా సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకూ లైట్లు,ఏసీల వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు.

గత రెండేళ్ల కరోనా కారణంగా పరిశ్రమలు సరిగా పనిచేయకపోవడం, ఇతర సంస్థలు, వాణిజ్య సంస్థలు కార్యకలాపాలి లేకపోవడంతో విద్యుత్ వాడకం తక్కువగా ఉందన్నారు. కానీ వ్యవసాయం ఎక్కువ కావడం,ఏప్రిల్ లో గతంలో మాదిరిగా కనీసం వర్షాలు కూడా లేకపోవడంతో గతంలో కంటే ఈసారి డిమాండ్ పెరిగినదని చెప్తున్నారు. ఈ నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. తెలంగాణ,గుజరాత్ లాంటి ఎక్కువ పరిశ్రమలు ఉన్న చోట్ల కూడా పవర్ హాలీడే తప్పడం లేదంటున్నారు. పవర్ హాలీ డే ప్రభావం రాష్ట్రంలో పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం చూపనుంది.పరిశ్రమలు ఒక్క రోజు మూతపడినా కార్మికులకు కష్టాలు తప్పవు.

రైతులకు, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసమే ఎస్పీడిసిఎల్ పరిధిలోని 5 జిల్లాల్లో పరిశ్రమల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టామని .ఎస్ పి డి సి ఎల్ సిఎండి హారనాథ రావు.డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ లభ్యత లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. ఎస్ పి డి సి ఎల్ పరిధిలో 1696 పరిశ్రమల్లో వారాంతపు సెలవులకు అదనంగా మరొక రోజు పవర్ హాలిడే ను అమలు చేస్తున్నామన్నారు. 253 నిరంతర ప్రాసెసింగ్ పరిశ్రమల్లో రోజువారి విద్యుత్ వినియోగంలో 50 శాతం మాత్రమే విద్యుత్ వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టామన్నారు. రేపటి నుంచి మూడు మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో ఆ తర్వాత కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించామని తెలిపారు. షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల్లోనూ విద్యుత్ వాడకాన్ని 50 శాతం మేరకు తగ్గించుకోవాలని ఆదేశించాం. ఏసీల వాడకాన్ని తగ్గించి విద్యుత్ సరఫరాలో అంతరాయాల్లేకుండా సహకరించాలని కోరుతున్నాం. అడ్వటైజ్మెంట్ సైన్ బోర్డులకు విద్యుత్ సరఫరా నిలిపి వేయాలని ఆదేశించారు ఎస్‌పీడీసీఎల్ సీఎండీ హారనాథ రావు.

Read Also…  Singareni Recruitment: సింగరేణిలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..