AP News: విశాఖ అత్యాచారం కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతోన్న భయంకర నిజాలు..
విశాఖ అత్యాచారం కేసులో ఒక్కొక్కటిగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా ఆరు రోజులు.. విశాఖపట్నంలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డినట్టు విచారణలో గుర్తించారు పోలీసులు.

విశాఖ అత్యాచారం కేసులో ఒక్కొక్కటిగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా ఆరు రోజులు.. విశాఖపట్నంలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డినట్టు విచారణలో గుర్తించారు పోలీసులు. అత్యాచారం కేసులో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను ప్రేమపేరుతో ట్రాప్ చేసిన ఇమ్రాన్, అత్యాచారానికి పాల్పడ్డాడు. మనస్తాపానికి గురైన బాధితురాలు.. ఆత్మహత్య చేసుకునేందుకు బీచ్‌కి వెళ్లింది. ఆర్కే బీచ్‌లో టూరిస్ట్ ఫొటోగ్రాఫర్లు ఆమెను ట్రాప్ చేశారు. గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
డిసెంబర్ 17 నుంచి 22 వరకు అఘాయిత్యానికి పాల్పడినవారిలో ఇప్పటివరకు పోలీసులు పదిమంది నిందితులను గుర్తించారు. అందులో కొంతమందిని అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్నవారు ఝార్ఖండ్ పారిపోయినట్లు గుర్తించి వారిని పట్టుకునేందుకు అక్కడకు వెళ్లింది ప్రత్యేక పోలీసు బృందం. అత్యాచారం ఘటనలో బీచ్ ఫొటోగ్రాఫర్ల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అటువైపు వెళ్లాలంటేనే ఉలిక్కిపడుతున్నారు టూరిస్టులు.
ప్రేమపేరుతో ఇమ్రాన్, అతని స్నేహితుడు షోయబ్ ట్రాప్ చేశారు. ఆర్కే బీచ్‌లో మాత్రం ఫొటోగ్రాఫర్ షరీఫ్ అలియాస్ చెర్రీ బాధితురాలిని ట్రాప్ చేశాడు. బాధితురాలికి రాజుగా పరిచయం చేసుకున్నాడు. చెర్రీకి హరీష్, నాగేంద్ర సహా మరికొంతమంది సహకరించారు. ఇమ్రాన్, షోయబ్ ఝార్ఖండ్ పారిపోయినట్లు తెలుస్తోంది. బాధితురాలిని తీసుకెళ్లి నిర్బంధించినట్టు గుర్తించిన మహావీర్, ప్రియదర్శిని లాడ్జిల్లో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. కాగా, నిందితులపై పోలీసులు పొక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.