మానవత్వం మరిచిన భర్త..! భార్యపై పెట్రోల్ పోసి నిప్పు.. అడ్డొచ్చిన తల్లికీ గాయాలు..!

భార్యపై అనుమానంతో అమానుషంగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కోత ముక్కలో డబ్బులు పోగొట్టుకొని మద్యానికి బానిసైన భర్త... భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో భార్య నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అడ్డుకోబోయిన తల్లిపై కూడా పెట్రోల్ పడటంతో గాయలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగ్రాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మానవత్వం మరిచిన భర్త..! భార్యపై పెట్రోల్ పోసి నిప్పు.. అడ్డొచ్చిన తల్లికీ గాయాలు..!
Crime

Edited By:

Updated on: Jun 11, 2026 | 1:35 PM

భార్యపై అనుమానంతో అమానుషంగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కోత ముక్కలో డబ్బులు పోగొట్టుకొని మద్యానికి బానిసైన భర్త… భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో భార్య నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అడ్డుకోబోయిన తల్లిపై కూడా పెట్రోల్ పడటంతో గాయలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగ్రాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వినుకొండ మండలం గోకన కొండకు చెందిన ఆంజనేయులకు పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన సుబ్బులుతో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించి వీరిద్దరి మద్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. కోత ముక్కకు అలవాటైన ఆంజినేయులు మద్యం సేవిస్తూ భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే సుబ్బులు వివాహేతర సంబంధం కొనసాగిస్తుందంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 10) ఉదయం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆంజినేయులు పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. రాత్రి గ్రామంలో సాంఘిక నాటకం ప్రదర్శించారు. గ్రామమంతా నాటకం తిలకించే పనిలో ఉండగా, ఆంజనేయులు భార్యపై పెట్రోలో పోసి నిప్పంటించాడు. ఆంజనేయులు తల్లిపై కూడా పెట్రోల్ పడటంతో ఆమెకు మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెలుతున్న స్థానికుడు చూసి మంటలు ఆర్పి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. వ్యసనాలకు బానిసై భార్యను తుద ముట్టించాలన్న ఉద్దేశంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు స్థానికులు భావిస్తు్న్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంజనేయులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us