కరెంట్‌ బిల్‌ చూసి కళ్లు బైర్లు కమ్మాయి..! ఎన్ని లక్షలొచ్చిందో తెలిస్తే షాక్‌ తగలడం ఖాయం..

మలికిపురం గ్రామంలోని ఒక చిన్న బట్టల దుకాణానికి రూ. 3,38,000ల భారీ కరెంట్ బిల్లు వచ్చింది. సాధారణంగా రూ. 400-700 వచ్చే బిల్లు ఇంత పెరగడంతో వ్యాపారి ఆందోళన చెందుతున్నాడు. విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఇలాంటి పొరపాట్లు మరికొందరికి కూడా జరిగాయని, విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కరెంట్‌ బిల్‌ చూసి కళ్లు బైర్లు కమ్మాయి..! ఎన్ని లక్షలొచ్చిందో తెలిస్తే షాక్‌ తగలడం ఖాయం..
Current Bill

Edited By:

Updated on: Jul 08, 2025 | 6:49 AM

సాధారణంగా రూ.400 నుంచి రూ.700 మధ్య రావాల్సిన కరెంట్ బిల్‌.. అంతే వస్తుందేలే అనుకున్నాడు. కానీ బిల్‌ చూడగానే పాపం అతని కళ్లు బైర్లు కమ్మాయి. ప్రతి నెలా వచ్చే బిల్లుకు కాస్త అటూ ఇటూ వస్తే పర్లేదు. కొన్ని సార్లు డబల్‌ వచ్చినా.. కరెంటోళ్లను తిట్టుకుంటూ కట్టేస్తాం. కానీ, ఓ వ్యక్తికి ఏకంగా 3 లక్షల 38 వేల రుపాయల కరెంట్‌ బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి.. అతని గుండె ఝల్లుమంది. అన్ని లక్షల బిల్లు రావడానికి అతనిదేం పెద్ద ఫ్యాక్టరీ కాదు.. ఒక చిన్న గదిలో బట్టల కొట్టు అంతే. దానికే అంత బిల్లు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురానికి చెందిన వ్యక్తికి ఈ భారీ కరెంట్‌ బిల్‌ వచ్చింది.

మలికిపురం గ్రామంలో చిన్న గదిలో బట్టల వ్యాపారం చేసుకునే కుంపట్ల యువకుమార్ కు సాధారణంగా ప్రతినెలా రూ.400 నుండి రూ.700 మధ్య విద్యుత్ బిల్లు వచ్చేది. అయితే జూలై నెలకి ఏకంగా 3 లక్షల 38 వేల రూపాయలు రావడంతో అతను అవాక్కైయ్యాడు. తన పరిస్థితి ఏంటని విద్యుత్ శాఖ అధికారులను వ్యాపారి ప్రశ్నిస్తున్నాడు. కస్టమర్ కేర్ నెంబర్ కి ఫిర్యాదు చేస్తే , స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమని సూచించినట్లుగా చెప్తున్నాడు. ఇటీవల తనలాగే కొందరు చిరు వ్యాపారులకు లక్ష రూపాయలకు పైగా కరెంట్ బిల్లు వచ్చిందని.. ఇలాంటి పొరపాట్లు చేసి తమకు షాక్ ఇస్తే ఎలా అని వాపోతున్నారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి