AP News: కార్తీక మాసంతో అద్భుతం..రైతు పొలంలో పనులు చేస్తుండగా బయల్పడిన శివలింగం

| Edited By: Ram Naramaneni

Nov 18, 2024 | 2:15 PM

అది అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం.. పొలంలో రైతు పొలంలో చేసుకుంటున్నాడు.. ఇంతలో అతని పనిముట్టుకు ఏదో తగిలినట్టు అనిపించింది. తీసే ప్రయత్నం చేశాడు రాలేదు.. ఇంకా గట్టిగా తీయాలని చూసినా కుదరలేదు.. చుట్టూ తవ్వి చూసేసరికి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది ఏంటో తెలుసా..

AP News: కార్తీక మాసంతో అద్భుతం..రైతు పొలంలో పనులు చేస్తుండగా బయల్పడిన శివలింగం
Shivling
Follow us on

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రైతు పొలంలో పనులు చేస్తుండగా శివలింగం బయటపడింది. కొయ్యూరు మండలంలోని రేవళ్లు పంచాయతీ కంఠారం శివారులలోని బంధమామిళ్లకు చెందిన వడగం సత్తిబాబు అనే రైతుకు చెందిన పొలంలో చిన్న సైజు శివలింగం బయల్పడింది. ఆదివారం రైతు పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఈ శివలింగం బయటపడినట్లు తెలిసింది. అసలే కార్తీక మాసం కావడం, శివలింగం ప్రత్యక్షం కావడంతో భక్తులు తన్మయత్వంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని రేవళ్లు పంచాయతీ.. కంఠారం శివారు.. బంధమామిళ్ల గ్రామం. అక్కడ ఉన్న వారంతా పోడు వ్యవసాయం, పాడి పశువుల పైన జీవనాధారం. పొలాలు దుక్కి దున్ని చెమటోడ్చి పండించి వాటితో పొట్ట పోసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. రోజు మాదిరిగానే వందమామిళ్ల గ్రామానికి చెందిన సత్తిబాబు అనే రైతు.. పొలం పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పనిముట్టుకు ఏదో తగిలినట్టు అనిపించింది. తవ్వి చూసేసరికి శివలింగం బయటపడింది. చిన్న పరిమాణంలో ఉన్న ఈ శివలింగం ఆదివారం నాడు రైతు పొలంలో పనులు చేస్తుండగా ఈ శివలింగం బయట పడిందని స్థానికులు అంటూన్నారు. విషయం ఆ నోట ఈనోటా పాకింది.. అసలే కార్తీక మాసం కు తోడు శివలింగం ప్రత్యక్షం కావడంతో ఆ పరమశివుడే ప్రత్యక్షమైనట్టు భారీగా జనం తరలివచ్చారు. పొలంలో శివలింగానికి పూజలు ప్రారంభించారు. కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. అయితే పొలంలో శివలింగం బయటపడిన అంశంపై అధికారులు ఆరాతీస్తున్నారు. మొత్తం మీద రైతు పొలంలో శివలింగం బయటపడడం అంతకంటే అదృష్టమే ఉంటుందని చుట్టుపక్కల గ్రామాలంతా చర్చించుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి