Shilparamam: టూరిజం స్పాట్‌గా గుంటూరు.. శిల్పారామాన్ని ప్రారంభించిన మంత్రి రోజా.. స్టేజిపై స్టెప్పులు వేసి సందడి..

|

Oct 15, 2023 | 7:01 AM

2017లో కేంద్ర ప్రభుత్వం గుంటూరులో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించింది. చేనేత హస్త కళల విభాగం తీర్మానం చేసి నాలుగు కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించింది. ఈ నిధుల్లో కేంద్రం 1.58 కోట్లు మంజూరు చేయగా.. ఏపీ ప్రభుత్వం 2.98 కోట్లు కలిపి మొత్తం నాలుగున్నర కోట్లతో శిల్పారామం ఏర్పాటు అయింది. గుంటూరులో శిల్పారామం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా.

Shilparamam: టూరిజం స్పాట్‌గా గుంటూరు.. శిల్పారామాన్ని ప్రారంభించిన మంత్రి రోజా.. స్టేజిపై స్టెప్పులు వేసి సందడి..
Shilaparamam In Guntur
Follow us on

గుంటూరు అట్టహాసంగా నిర్మించిన శిల్పారామాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. శిల్పారామం అందుబాటులోకి రావడంతో గుంటూరు మరింత పర్యాటక ప్రాంతంగా మారనుంది. శిల్పారామం అనగానే హస్తకళా వస్తువులు గుర్తుకొస్తాయి. చెవి పోగుల, దుస్తులు, గాజులు, హ్యాంగ్స్ బ్యాగ్స్, చెప్పులు ఇలా అనేక రకాల వస్తువులు ఒకే చోట కనిపించి మగువల మనసు దోచేస్తాయి.

కళలకు కొలువు శిల్పారామం.. శిల్పారామం హ్యాండీ క్రాఫ్ట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది హైదరాబాదే. పూర్తి గ్రామీణ వాతావరణంతో పల్లెటూరు అందాలన్నీ కేంద్రీకృతమై ఉండే టూరిజం స్పాట్. అందుకే.. భాగ్యనగరంలో ఎన్నో సంప్రదాయ పండుగలకు శిల్పారామం వేదికవుతోంది. కానీ.. ఇప్పుడు గుంటూరు కూడా ఆ పేరు సొంతం చేసుకుంటోంది. అలాంటి అద్భుత శిల్పారామం గుంటూరులోనూ ఏర్పాటైంది. గుంటూరులోని నిర్మించిన ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్‌ కల్చరల్ సొసైటీని పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించారు.

2017లో కేంద్ర ప్రభుత్వం గుంటూరులో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించింది. చేనేత హస్త కళల విభాగం తీర్మానం చేసి నాలుగు కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించింది. ఈ నిధుల్లో కేంద్రం 1.58 కోట్లు మంజూరు చేయగా.. ఏపీ ప్రభుత్వం 2.98 కోట్లు కలిపి మొత్తం నాలుగున్నర కోట్లతో శిల్పారామం ఏర్పాటు అయింది. గుంటూరులో శిల్పారామం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా. నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వ్యయంతో శిల్పారామం నిర్మించామని తెలిపారు. కుటుంబ సభ్యులతో హాయిగా వచ్చి సేదతీరి, బోటింగ్‌లో విహరించే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరోవైపు.. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నలుగురు పద్మశ్రీ అవార్డు గహీతలను సన్మానించామన్నారు. ఇక.. శిల్పారామం ప్రారంభం సందర్భంగా.. మంత్రి రోజా విద్యార్ధులతో కలిసి స్టెప్పులు వేశారు. మొత్తంగా.. శిల్పారామం ప్రారంభంతో గుంటూరులో మరో టూరిజం స్పాట్‌ అందుబాటులో వచ్చింది. వీకెండ్ సమయాల్లో ప్రజలు తరలిరానుండటంతో శిల్పారామం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..