Konaseema: 7 కోడిగుడ్లు మింగిన తాచుపాము.. ఆ తర్వాత..
కోనసీమ జిల్లాలో తాచుపాము హల్‌చల్ చేసింది. ఓ ఇంట్లోకి చేరిన పాము ఏడు కోడిగుడ్లను చడీచప్పుడు లేకుండా మింగేసింది. ఆ తర్వాత ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోడానికి ఆపసోపాలు పడింది. చివరకు మింగేసిన గుడ్లను కక్కేసింది. తరువాత స్నేక్ క్యాచర్ గణేష్ సాయంతో ఆ తాచుని డబ్బాలో బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాచుపాము సైలెంట్‌గా ఓ ఇంట్లోకి ఎంటరయ్యింది. దాని కోసమే పెట్టినట్లుగా కోడిగుడ్లు ఆ పాము కంటపడ్డాయి. ఊరుకుంటుందా చెప్పండి. ఒకదాని వెంట ఒక 7 కోడి గుడ్లను మింగేసింది. అన్ని గుడ్లు మింగిన తర్వాత దాని కడుపు సహకరిస్తుందా చెప్పండి. పొట్ట ఉబ్బరంతో అక్కడి నుంచి కదల్లేకపోయింది. మింగిన గుడ్లను ఒకదాని వెంట ఒకటి కక్కేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Oct 14, 2023 09:33 PM
వైరల్ వీడియోలు
Latest Videos