AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donkey milk: గాడిద పాలు లీటర్ రూ. 1,600.. నెలకు లక్షల్లో ఆదాయం.. కట్ చేస్తే…

డాంకీ ప్యాలెస్ పేరుతో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల కుంభకోణానికి తెర లేపారు. డాంకీ మిల్క్ తో లాభాలే లాభాలు అంటూ తెలుగు రాష్ట్రాల రైతుల నుంచి కోట్లల్లో వసూలు చేసింది ఓ ముఠా.

Donkey milk: గాడిద పాలు లీటర్ రూ. 1,600.. నెలకు లక్షల్లో ఆదాయం.. కట్ చేస్తే...
Donkey
Sridhar Rao
| Edited By: |

Updated on: Nov 15, 2024 | 5:35 PM

Share

బాబు ఉలగనాథం, గిరి సుందర్‌, సోనికా రెడ్డి, బాలాజీ, డాక్టర్‌ రమేష్‌ కుమార్‌… 2022లో ఈ ఐదుగురు ముఠాగా ఏర్పడి డాంకీ ప్యాలెస్‌ పేరుతో వందలాదిమంది రైతులను నిలువునా ముంచేశారు. తమిళనాడు తిరునల్వేలిలో ఈ డాంకీ ప్యాలెస్‌ స్కీమ్‌ పేరుతో స్కామ్‌కి తెర లేపారు. డాంకీ ప్యాలెస్‌ పేరుతో ఫ్రాంచైజీలు అంటూ గాడిదలను రైతులకు అంటగట్టారు ఈ కేటుగాళ్లు. గాడిద పాలు తామే కొనుగోలు చేస్తామని చెప్పి, బాధితుల నుంచి లక్షల రూపాయలు గుంజి, ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర…ఇన్ని రాష్ట్రాల్లో రైతులను నిలువునా ముంచేసింది ఈ ముఠా. అసలు వీళ్ల స్కామ్ ఎలా జరిగిందంటే….

డాంకీ ప్యాలెస్‌ ఫ్రాంచైజీల పేరుతో స్కామ్‌‌కు తెరలేపారు. ఒక్కో గాడిదను రూ. 80 వేల నుంచి లక్ష వరకు అమ్మారు. డాంకీ మిల్క్‌ లీటర్‌ రూ. 1,600కి కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి నెల లక్షలు వస్తాయన్నారు. 2 నెలల పాటు గాడిద పాలు తీసుకెళ్లారు.  ఆ తర్వాత డబ్బివ్వకుండా ముఖం చాటేశారు. చెక్కులిచ్చి కనపడకుండా చెక్కేశారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100మందికి టోకరా వేశారు.  తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 100 కోట్ల దోపిడి జరిగినట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి 400మంది డాంకీ ప్యాలెస్‌ బాధితులు ఉన్నారు. ఒక్కో రైతు 30 నుంచి 50 గాడిదలను కొనుగోలు చేశారు. అంటే సుమారుగా రూ. 30 లక్షల నుంచి 50 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. పైసా రాకపోగా, ఇప్పుడు గాడిదల పోషణ భారం కూడా తమ మీదే పడిందని బాధితులు వాపోతున్నారు. ఇక ఫ్రాంచైజీ కోసం ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని, గాడిదల పోషణ, పాలు పితకడం గురించి క్లాసుల పేరుతో మరో 50 వేలు వసూలు చేశారని బాధితులు బావురుమంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి