Andhra: ఆటగదరా శివ.. తాడిపూడిలో ఐదుగురు స్టూడెంట్స్.. సున్నిపెంటలో తండ్రీకొడుకు

పండగ పూట పెను విషాదం... తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో బుధవారం ఉదయం స్నానానికి వెళ్లి ఐదుగురు వ్యక్తులు మునిగిపోయారని స్థానిక పోలీసులు తెలిపారు. 12 మంది స్టూడెంట్స్ స్థానానికి వెళ్లగా... ఐదుగురు మునిగిపోగా, ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారని వారు తెలిపారు. అటు సున్నిపెంటలోనూ ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది.

Andhra: ఆటగదరా శివ.. తాడిపూడిలో ఐదుగురు స్టూడెంట్స్.. సున్నిపెంటలో తండ్రీకొడుకు
Godavari River

Updated on: Feb 26, 2025 | 1:46 PM

మహాశివరాత్రి వేళ ఘోర విషాదం చోటు చేసుకుంది. పలువురి కుటుంబాల్లో పండుగ తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో పుణ్యస్నానానికి వెళ్లి ఐదుగురు చనిపోయిన ఘటన ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది. శివరాత్రి కావడంతో తెల్లవారుజామునే 12 మంది స్నేహితులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నం చేసినా 12మందిలో ఐదుగురూ గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు అనిశెట్టి పవన్‌, దుర్గాప్రసాద్‌, సాయి కృష్ణ , తిరుమలశెట్టి పవన్‌ , గర్రె ప్రకాశ్‌గా గుర్తించారు. వీరిలో నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. మరో విద్యార్థి మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వీరంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న 20 ఏళ్ల లోపు విద్యార్థులుగా గుర్తించారు. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

సున్నిపెంటలో దారుణం… పాతళగంగలో స్నానానికి వెళ్లి తండ్రీకొడుకు మృతి

పండగ పూట నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీశైలంలోని సున్నిపెంట పాతాళగంగలో స్నానానికి వెళ్లి తండ్రికొడుకులు చనిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. మృతిచెందిన వారిది తూర్పుగోదావరి జిల్లా గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..