Kurnool: పొలంలో తోటికోడళ్ల హత్య.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజం.. వామ్మో

పిల్లలు పుట్టకపోతే దత్తత తీసుకోవచ్చు కదా..? ఇంకా వైద్యపరంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి..? ఇవన్నీ తెలీదా..? ఈ పుచ్చు మొదళ్లు ఎప్పుడు బాగుపడతాయి..?

Kurnool: పొలంలో తోటికోడళ్ల హత్య.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజం.. వామ్మో
Agricultural Field (representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 16, 2022 | 2:51 PM

కర్నూలులో  జిల్లాలో ఇద్దరు తోడికోడళ్ల మర్డర్‌ మిస్టరీ వీడింది. ఆ మహిళలను వారి భర్తలు, మామ కలిసి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. వారసులు కలగడం లేదని ఇద్దరు తొడికోడళ్లను మట్టుబెట్టారు. భర్తలు పెద్ద గోవిందు, చిన్న గోవిందు ,మామ గోగన్న ఈ హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఓర్వకల్ మండలం నన్నూరులో ఈనెల 14న తోడికోడళ్ళు రామేశ్వరి, రేణుక దారుణ హత్యకు గురయ్యారు. ఉద్రిక్తతల మధ్య పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పెళ్లయి ఆరేళ్లు అవుతున్నా సంతానం లేకపోవడంతో ఆస్తికి వారసులు లేరనే దుర్బుద్ధితో హత్యలకు పాల్పడినట్టు తేల్చారు.

గోగన్న కుటుంబానికి 20 కోట్లకు పైగా విలువైన 30 ఎకరాల ఆస్తి ఉంది. తన అనారోగ్యానికి కోడళ్లే కారణమని నాటు వైద్యుడు చెప్పడంతో అదే అనుమానం పెను భూతమైంది. ఈ విషయాన్ని కుమారులకు చెప్పి వారిని పక్కదోవ పట్టించాడు. ఇద్దరు కోడళ్లకు సంతానం కలుగకపోవడంతో వారిని హతమార్చాలని నిర్ణయించుకుని కుమారుల సాయంతో అతికిరాతకంగా హత్య చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు గోగన్నతోపాటు పెద్దగోవిందు, చిన్నగోవిందును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించారు. మూఢ నమ్మకాలతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ, కాపురాల్లో చిచ్చులు పెడుతున్న నాటు వైద్యునిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం