TDP: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ కారణంగానే ఆయన టీడీపీకి రాజీనామా చేసినట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన 23 ఎమ్మెల్యేల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరి.
మంత్రిగా పని చేసిన ఆయన.. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలంతా సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపించారు. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వైసీపీని ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశారు. కానీ, సొంత పార్టీ అధినాయకత్వం నుంచి తనకు సరైన మద్ధతు లభించడం లేదని, ఈ వైఖరికి నిరసనగానే పార్టీని వీడాలని గోరంట్ల నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
Also read:
Shreyas Iyer – IPL 2021: అయ్యారే.. అయ్యర్ షాట్ అదిరిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..!