Tirumala Tirupati: అన్ని దళాలు ఒకే గొడుగు కిందకు.. తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష..

తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై ఏపీ ప్రభుత్వ హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా సమక్షంలో కీలక సమీక్ష జరిగింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన సెక్యూరిటీ ఆడిట్ సమావేశంలో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Tirumala Tirupati: అన్ని దళాలు ఒకే గొడుగు కిందకు.. తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష..
Ttd News

Updated on: May 24, 2023 | 8:26 AM

తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై ఏపీ ప్రభుత్వ హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా సమక్షంలో కీలక సమీక్ష జరిగింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన సెక్యూరిటీ ఆడిట్ సమావేశంలో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖలకు సంబంధించి 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కోవిడ్ అనంతరం తిరుమలకు యాత్రికులు పెరగడం, వాహనాల రద్దీ పెరగడంతో భద్రతను ఎలా పెంచాలనే విషయమై చర్చించారు. తిరుమలకు పటిష్టమైన భద్రత కోసం అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని హరీష్ కుమార్ గుప్తా అభిప్రాయపడ్డారు.

అంతకుముందు.. టీటీడీ సీవీఎస్వో నరసింహకిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తిరుమలలో భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన ప్రదేశాల గురించి తెలియజేశారు. భక్తుల సెంటిమెంటు, ఆగమశాస్త్రానికి ఇబ్బంది కలగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. అలాగే.. తిరుమల పుణ్యక్షేత్రంలో త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు.

అంతకుముందు.. టిటిడి సివిఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తిరుమలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన భద్రత, ఇంకా భద్రతను మరింత పటిష్టం చేయవలసిన ప్రదేశాల గురించి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..