SEC Nimmagadda Ramesh : నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిని… కాస్త పెద్ద ఉద్యోగిని… నా పరిధి.. బాధ్యత నాకు తెలుసు..

|

Feb 03, 2021 | 5:27 PM

రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ అన్నారు. తమ విధుల్లో జోక్యం చేసుకున్నారు కనుకే కోర్టుకు వెళ్లామని ఎస్‌ఈసీ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో..

SEC Nimmagadda Ramesh : నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిని... కాస్త పెద్ద ఉద్యోగిని... నా పరిధి.. బాధ్యత నాకు తెలుసు..
Follow us on

SEC Nimmagadda Ramesh : రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ అన్నారు. తమ విధుల్లో జోక్యం చేసుకున్నారు కనుకే కోర్టుకు వెళ్లామని ఎస్‌ఈసీ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతూ… ఏకగ్రీవాలకు తాము పూర్తిగా వ్యతిరేకం కాదని..,అయితే బలవంతపు ఏకగ్రీవాలు చేస్తేనే సమస్యలు వస్తాయని అభిప్రయపడ్డారు.

ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన విధులు కేటాయించిందని ఎస్‌ఈసీ అన్నారు. 40 ఏళ్ల తన సర్వీసులో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదన్నారు. అయితే.. తమ పరిధి, బాధ్యత తెలుసునన్న ఎస్ఈసీ.. స్వీయ నియంత్రణ పాటిస్తానన్నారు.

బాధ్యతలు నిర్వహించేందుకే అధికారాలు ఇచ్చారని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. తమ విధుల్లో జోక్యం చేసుకున్నారు కనుకే కోర్టుకు వెళ్లామని.. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఏకగ్రీవాలపై తమకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉందని వెల్లడించారు. ఏకగ్రీవాలకు తాము పూర్తిగా వ్యతిరేకం కాదని నిమ్మగడ్డ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..