Kurnool Check Post: అవన్నీ లగేజీ బ్యాగులు అనుకున్నారు.. ఓపెన్ చేసి చూస్తే కళ్లు చెదిరిపోయాయి..

|

Feb 17, 2022 | 12:36 PM

Kurnool Check Post: ఆ కారు నిండా లగేజీ బ్యాగులే ఉన్నాయి. అందులో ఏమున్నాయంటే.. దుస్తులు, ఇతర వస్తువులు అని బదులిచ్చారు..

Kurnool Check Post: అవన్నీ లగేజీ బ్యాగులు అనుకున్నారు.. ఓపెన్ చేసి చూస్తే కళ్లు చెదిరిపోయాయి..
Bags
Follow us on

Kurnool Check Post: ఆ కారు నిండా లగేజీ బ్యాగులే ఉన్నాయి. అందులో ఏమున్నాయంటే.. దుస్తులు, ఇతర వస్తువులు అని బదులిచ్చారు వాటిని తరలిస్తున్న వ్యక్తులు. కానీ, భారీ సంఖ్యలో బ్యాగులు ఉండటంతో అనుమానించిన పోలీసులు.. వాటిని ఓపెన్ చేయాల్సిందిగా కోరారు. దాంతో నీళ్లు నమలడం మొదలు పెట్టారు సదరు వ్యక్తులు. వారి మొహంలోని హావభావాలను గమనించిన పోలీసుల.. ఏదో తేడాగా ఉందని నిశ్చయానికి వచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ వ్యక్తులను, వారి వెంట ఉన్న లెగేజీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగుల్లో ఒక దానిని ఓపెన్ చేసి చూడగా కళ్లు చెదిరిపోయాయి. తళుకు తళుకుమంటూ మిళమిళ మెరాశాయి. ఆ బ్యాగు నిండా జిగేల్‌మంటూ వెండి ఆభరణాలు ఉన్నాయి. మరో బ్యాగ్ తెరిచి చూస్తే అందులోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మొత్తం 10 లగేజీ బ్యాగుల నిండా వెండి ఆభరణాలే ఉన్నాయి. వాటిని షాక్ అయిన అధికారులు.. ఇవన్నీ ఎక్కడవని ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. దాంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో పంచలింగాల చెక్ పోస్టు వద్ద వెలుగు చూసింది.

వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా పంచలింగాల అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో బ్యాగులు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూస్తే మొత్తం వెండి ఆభరణాలు కనిపించాయి. అవి ఎక్కడవని ఆరా తీస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు వాటిని తరలిస్తున్న వ్యక్తులు. దాంతో పది బ్యాగులలో ఉన్న వెండి ఆభరణాలను, వాటిని తరలిస్తున్న కారు, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం 167 కేజీల వెండి ఆభరణాలు అనధికారికంగా తరలిస్తున్న గుర్తించారు పోలీసులు. పట్టుబడిన వెండి ఆభరణాల విలువ రూ. 1.20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. బెంగళూరుకు చెందిన అభిషేకం వీటిని తరలిస్తున్నాడని, అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ మంజుల వెల్లడించారు.

Silver Ornaments

Also read:

AP Gold Loans: గోల్డ్ లోన్ తీసుకునే రాష్ట్రాలో టాప్‌లో ఏపీ.. షాకింగ్ విషయాలు మీకోసం..

Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ పొందండి..!

TTD Temple: నేడు టీటీడీ బోర్డు కీలక సమావేశం.. 2022-23 టీటీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పాలక మండలి..