Sankranti Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

|

Dec 27, 2022 | 8:10 PM

Sankranti special trains: సంక్రాంతి పండుగ సందర్భంగా.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాల మధ్య 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.

Sankranti Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Sankranti Special Trains
Follow us on

Sankranti special trains: సంక్రాంతి పండుగ సందర్భంగా.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాల మధ్య 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ముఖ్యమైన సందర్భాలలో లేదా సెలవులు/పండుగ సీజన్లలో రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, జనవరి నెలలో సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికుల నుండి డిమాండ్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సంక్రాంతి పండుగ, సెలవుల సీజన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్ ఉంది. ఇందుకు అనుగుణంగా సెలవుల కాలంలో అదనపు ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి, అలాగే రైలు ప్రయాణికుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి వివిధ గమ్యస్థానాల మధ్య 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 1 నుంచి జనవరి 20 వరకు వేర్వేరు తేదీల్లో నడుస్తాయని తెలిపింది.

దక్షిణ మధ్య రైల్వే పైన పేర్కొన్న తేదీలలో 94 ప్రత్యేక రైలు సర్వీసు సేవలను ప్రకటించింది. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా ఇతర ప్రసిద్ధ గమ్యస్థానాలకు కూడా రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైలు సర్వీసులు వివిధ క్లాస్ లను కలిగి ఉంటాయి. ఇందులో రిజర్వ్‌డ్ కోచ్‌లు, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు అన్ని విభాగాల ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. రిజర్వ్ చేసిన వసతిని కోరుకునే ప్రయాణికులు రైల్వే పిఆర్ఎస్ కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు తమ టిక్కెట్‌లను మొబైల్ యాప్‌లో యుటిఎస్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తద్వారా జనరల్ కౌంటర్‌ల వద్ద క్యూలో నిల్చొని టికెట్‌ తీసుకోవడాన్ని నివారించవచ్చు.

రైల్వే అందిస్తున్న ఈ సౌకర్యాన్ని రైలు ప్రయాణికులు వినియోగించుకోవాలని, వారి ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. సంక్రాంతి రద్దీని నివారించేందుకు, అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా సమీకరించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రోలింగ్ స్టాక్, రూట్, సిబ్బంది తదితర వనరుల లభ్యత మేరకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టేందుకు జోన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..

Sankranti Special Trains

మరిన్ని ఏపీ వార్తల కోసం..